Vissannapeta
-
విస్సన్నపేట భూములపై చెప్పుడు మాటలు విని నవ్వుల పాలైన పవన్
-
వరదలపై మురికి మనసులు..బురద పనులు
-
ఏలూరు జిల్లా: విస్సన్నపేటలో క్షుద్ర పూజల కలకలం
-
కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన తహసీల్దార్
విస్సన్నపేట(తిరువూరు): ప్రభుత్వ పాఠశాలలో తన కుమార్తెను చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు విసన్నపేట తహసీల్దార్ బి మురళీకృష్ణ. స్థానిక మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్‌లో రెండో తరగతిలో తహసీల్దార్ తన కుమార్తెను బుధవారం చేర్పించారు. చదవండి: నచ్చిన వారికి కొలువులు.. అడిగినంత వేతనం సంక్షేమ క్యాలెండర్: పథకాల అమలు ఇలా.. -
విషజ్వరాలపై మంత్రి ఆళ్ల నాని ఆరా
సాక్షి, విస్సన్నపేట: కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలో ప్రబలిన విష జ్వరాలపై డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. మండలంలోని కొండ పర్వం గ్రామంలో కలుషిత నీరు కారణంగా ప్రబలిన విషజ్వరాలపై మంత్రి.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుండి ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొండపర్వం గ్రామంలో పర్యటించి వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు (చదవండి: ఏలూరులో సాధారణ పరిస్థితి) అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు భయపడొద్దని, విష జర్వాల నివారణకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తక్షణమే పారిశుధ్య పనులు చేపట్టి డ్రైనేజీ పనులు చేపట్టాలని కృష్ణా జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. కొండపర్వంలో ప్రత్యేకంగా వైద్య బృందాలతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. (చదవండి: వీరవాసరం ఏఎస్ఐపై హత్యాయత్నం) -
మానవత్వం చాటుకున్న విస్సన్నపేట పోలీసులు
సాక్షి, విజయవాడ: వలస కార్మికుల విషయంలో మానవత్వం చూపాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను పోలీసులు తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. కాలినడకన మండుటెండలో నడుస్తున్న గర్భిణీకి సాయం చేసి అందరి మన్ననలు పొందిన ఘటన ఆదివారం కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది. లాక్డౌన్ కారణంగా ఇతర ప్రాంతంలో చిక్కుకుపోయిన ఓ గర్భిణీ, తన కుటుంబ సభ్యులతో కలిసి స్వస్థలమైన చత్తీస్‌ఘడ్‌కు బయలు దేరింది. (అనస్థీషియా వైద్యుడి వీరంగం) ఈ విషయాన్ని గమనించిన విసన్నపేట పోలీసులు...వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి భోజనం పెట్టి మానవత్వం చాటుకున్నారు. ప్రభుత్వ ఖర్చులతో స్వస్థలానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్థానిక వ్యాపారి శ్రీనివాస్ తమ గ్రామానికి నడకమార్గాన చేరిన నిండు చూలాలిపై సోదర ప్రేమ చూపాడు. ఆమెకు శ్రీమంతం జరిపించి, చీర, జాకెట్ సారె పెట్టి దీవించాడు. చత్తీస్ఘడ్ ఆడపడుచుకు శ్రీమంతం చేసిన శ్రీనివాస్‌ను ఎస్సై లక్ష్మణ్, ఎంఆర్ఓ మురళీకృష్ణ అభినందించారు. ఈ ఘటనపై గ్రామస్థులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. (ఇంటి వద్దే కరోనా పరీక్షలు) -
కృష్ణా జిల్లాలో ఐదు పంచాయతీలకు పట్టణ హోదా
సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో కొత్తగా మరో ఐదు నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. 20వేల జనాభాకు పైబడిన మేజర్ పంచాయతీలు త్వరలో నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి. నెలాఖరులోగా ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ప్రస్తుతం మూడుగా ఉన్న నగర పంచాయతీల సంఖ్య ఎనిమిదికి చేరుతుంది. జిల్లాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, పెడన మున్సిపాలిటీలుండేవి. ఆ తర్వాత ఉయ్యూరు, తిరువూరు, నందిగామ పంచాయతీలను 2011లో నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేశారు. కాగా ఇటీవలే మచిలీపట్నం మున్సిపాలిటీని జూలై 3వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. దీంతో జిల్లాలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలున్నాయి. తాజాగా 20వేల జనాభా కల్గిన మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో కొత్తగా మరో ఐదు మేజర్ పంచాయతీలు గ్రేడ్–3 మున్సిపాల్టీలు(నగర పంచాయతీలు) ఏర్పాటు కాబోతున్నాయి. దశాబ్దకాలంగా పెండింగ్.. దశాబ్దకాలంగా ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. 2015 మేలో అప్పటి ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు కోరినా నగర పంచాయతీల ఏర్పాటు మాత్రం కార్యరూపం దాల్చలేదు. కాగా 500 జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తిస్తామన్న ప్రభుత్వం అదే దిశగా 20వేల జనాభాకు పైబడిన మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలు అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించింది. ప్రకటనలతో సరిపెట్టకుండా వెంటనే కార్యచరణలో పెట్టింది. ఐదు పంచాయతీలు ఇవే.. జిల్లాలోని అవనిగడ్డ, కైకలూరు, మైలవరం, పామర్రు, విస్సన్నపేట పంచాయతీలు నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి. 2019 ప్రొజెక్టడ్ జనాభా లెక్కల ప్రకారం అవనిగడ్డ పంచాయతీ జనాభా 27,298, కైకలూరులో 24,486, మైలవరంలో 25027, పామర్రులో 24,604, విస్సన్నపేటలో 20,530 మంది జనాభా ఉన్నారు. ఈ లెక్కన చుట్టుపక్కల పంచాయతీలు, గ్రామాలను విలీనం చేయకుండానే ఈ ఐదు పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసే వీలుంది. అయితే అవనిగడ్డ నగర పంచాయతీలోకి పులిగడ్డ, రామకోటిపురం పంచాయతీలతో పాటు వేకనూరు పంచాయతీ పరిధిలోని గుడివాకవారిపాలెంలను విలీనం చేయాలని ప్రతిపాదన ఉంది. అలాగే మైలవరం నగర పంచాయతీలోకి వేల్వాడు, పామర్రు నగర పంచాయతీలోకి కనువూరు, కురుమద్దాలి, విస్సన్నపేట నగర పంచాయతీలోకి చండ్రుపట్ల, పాతగుంట్ల పంచాయతీలు విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉంది. చుట్టుపక్కల పంచాయతీలు, గ్రామాల విలీనం చేసినా చేయకున్నా ప్రతిపాదిత ఐదు మేజర్ పంచాయతీలకు పట్టణ హోదా పొందనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ప్రతిపాదనలు రాగానే వాటిని కేబినెట్లో పెట్టి ఆమోద ముద్ర వేయడం.. నగర పంచాయతీల ప్రకటించడం లాంఛనమే కానుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు జూలై 31వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ పరిపాలనా శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఐదు మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపిస్తున్నాం. – జి.రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి -
అన్నదాతలు అంటే అందరికీ చులకనే..
సాక్షి, విస్సన్నపేట (కృష్ణా): మండల కేంద్రమైన విస్సన్నపేట మార్కెట్‌యార్డు వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యం వేసి మూడు నెలలు కావస్తున్నా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు పడక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్క రైతుకు సుమారు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలు వరకు రావాల్సి ఉందని మూడు నెలలు అయినా నగదు చేతికి అందక పోతే ఇప్పుడు మరలా వ్యవసాయానికి పెట్టుబడులు ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే ఇలాచేస్తే ఎలా... ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేదు, దళారుల చేతిలో మోస పోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే ఇంతవరకు ఖాతాల్లో నగదు పడలేదని ఆవేదన చెందుతున్నారు. తమకు రావాల్సిన నగదు త్వరగా అందిస్తే మరలా వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టుకుంటామని అంటున్నారు. కాగా విస్సన్నపేట కొనుగోలు కేంద్రం నుంచి రూ.2 కోట్లు రైతుల ఖాతాల్లో నగదు జమకావాల్సి ఉందని ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది తెలుపుతున్నారు. ఈ మేరకు సివిల్ సప్లాయ్ డీటీ నాగజ్యోతిని వివరణ కోరగా నగదు చెల్లించాల్సిన రైతులందరి బిల్లులు ఆన్లైన్ చేయడం జరిగిందని రోజుకు కొంత మందికి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని, త్వరలో మిగతా రైతులకు నగదు జమ అవుతాయన్నారు. మూడు నెలలు దాటింది... ధాన్యం కొనుగోలు కేంద్రంలో దాన్యం అమ్మి మూడు నెలలు దాటింది. నేటికీ రూ.ఒక్కరూపాయి బ్యాంకు ఖాతాలో జమ కాలేదు, రూ.2 లక్షల వరకు మాకు నగదు రావాల్సి ఉంది, ఇంత మొత్తం నెలలు తరబడి ఇవ్వక పోతే మరలా వ్యవసాయానికి పెట్టుబడులు ఎలా వస్తాయి. - కట్టా రవి, రైతు, మోతేరావుపేట -
కృష్ణాజిల్లా వాళ్లకి కొవ్వు ఎక్కువ: చంద్రబాబు
సాక్షి, తిరువూరు: ‘నేను 24 గంటలూ మీకోసం కష్టపడుతున్నాను. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడపడానికి కృషిచేస్తున్నాను. కేంద్రం సహకరించకున్నా ఉన్నంతలో అభివృద్ధి చేస్తున్నాను. ఇంకా మీ సమస్యలుంటే పరిష్కరిద్దామని, ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు తెలుసుకుందామని ఫోన్లు చేస్తే ఎవరూ స్పందించట్లేదు. నా ఫోన్ కాల్స్‌కి 30 శాతం మంది మాత్రమే స్పందించి బదులిస్తున్నారు’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలోని తాతకుంట్ల గ్రామంలో శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష జరిపారు. ప్రతి వారిచేతిలో సెల్‌ఫోను ఉన్నా దానిని వినియోగించడంలో శ్రద్ధ చూపట్లేదని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటేనే ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ కుళాయిలు మంజూరు చేస్తామని, ప్రతి ఇంట్లో చెత్తసేకరణను డిజిటలైజేషన్ చేసి స్వయంగా తాను పర్యవేక్షిస్తానన్నారు. ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి డిజిటల్ లాకర్లో భద్రపరుస్తామని, అధిక బరువున్న విద్యార్థులకు త్వరలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ లక్ష్మీకాంతంకు సూచించారు. కృష్ణాజిల్లా వాళ్లకి కొవ్వు ఎక్కువ.. రాయలసీమలో పౌష్టికాహారలోపంతో ప్రజలు బాధపడుతుంటే కృష్ణాజిల్లాలో అధిక బరువుతో, కొవ్వు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇందుకు తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసే నిదర్శనమని సీఎం చెణుకులు విసిరారు. విద్యార్థుల్లో పోషక విలువలు పెంచడానికి ‘బాలసంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో మేము సైతం కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, మహిళలకు సజ్జ లడ్డూల పంపిణీతో సత్ఫలితాలు వస్తున్నాయని, ఇందుకు జిల్లా కలెక్టర్‌ను అభినందిస్తున్నానన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానీ, మంత్రులు దేవినేని ఉమమహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, మార్క్‌ఫెడ్ చైర్మన్ కంచి రామారావు, ఎస్సీ కమిషన్ సభ్యురాలు నల్లగట్ల సుధారాణి, మాజీ ఎమ్మెల్యేలు స్వామిదాసు, బాలవర్థనరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, కలెక్టర్ లక్ష్మీ కాంతం, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ, ఎస్సీ త్రిపాఠీ పాల్గొన్నారు. ‘2024లో మళ్లీ వస్తా’ తాతకుంట్ల(విస్సన్నపేట): ‘మీ ఊరు స్మార్ట్ విలేజ్‌గా అభివృద్ధి చెందాలి.. మళ్లీ 2024లో వస్తా అప్పటికి ఈ ఊరి స్వరూపమే మారిపోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మండలంలోని తాతకుంట్లగ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామదర్శిని, రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మొదటగా ఏరువాక కార్యక్రమంలో పాల్గొని, ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంటగుంటను పరిశీలించారు. అనంతరం మండలపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పరిశీలనలో విద్యార్థులు జీఎస్టీ అంటే ఏమిటి.. దానివల్ల ఉపయోగమా, నష్టమా? అనే అంశాలపై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం చెరువు కట్టమీద మొక్క నాటి, గ్రామంలో నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. పక్కా గృహ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యర్థాల నుంచి సంపద యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం గ్రామసభ, రచ్చబండ నిర్వహించారు. ఈ–అంబులెన్స్ యాప్‌ను ప్రారభించిన సీఎం గ్రామ వనాలు, గ్రామ సంతలు, గోకులాలకు శంకుస్థాపన చేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్, జిల్లాపరిషత్ చైర్పర్సన్ అనూరాధ, మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యురాలు సుధారాణి, గ్రామ నాయకుడు ఎన్టీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సీఎంను నిలదీసిన దివ్యాంగురాలు తాతకుంట్ల గ్రామదర్శిని తిరువూరు: ‘నాకు 95శాతం వైకల్యం ఉంది. డాక్టర్లు 67శాతమే ఉన్నట్లు సర్టిఫికెట్ ఇవ్వడంతో నెలకు రూ.వెయ్యి మాత్రమే పింఛన్ వస్తోంది. నేను ఏ పనీ చేయలేను, నాకు తల్లిదండ్రులు కూడా లేరు. ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవిస్తున్నా.. నాకు పూర్తిస్థాయి పింఛన్ ఎందుకివ్వరు’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఓ దివ్యాంగురాలు కోలేటి జ్యోతి నిలదీసింది. విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామదర్శిని, రచ్చబండ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాతకుంట్ల వచ్చిన ముఖ్యమంత్రి స్థానికుల సమస్యలు తెలుసుకునే క్రమంలో దివ్యాంగురాలు కోలేటి జ్యోతి సీఎంతో మట్లాడుతూ.. తాను తాతకుంట్ల శివారు గౌరంపాలెంలో నివసిస్తున్నానని, నా అనేవారు ఎవరూ లేరని, ఇతర దివ్యాంగులకు నెలకు రూ.15వందల పింఛన్ వస్తుంటే తనకు మాత్రం రూ.వెయ్యి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని వివరించింది. నాలుగేళ్ల క్రితం ఇచ్చిన మూడు చక్రాల సైకిలు కూడా పాడైపోయిందని అధికారులకు విన్నవించినా కొత్తది ఇవ్వట్లేదని వాపోయారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఆమెకు ఇకపై నెలకు రూ.15వందల పింఛన్ ఇవ్వాలని సీఎం స్థానిక అధికారులను ఆదేశించారు. రూ.50వేల ఆర్థికసాయం చెక్కును అందజేసి కొత్త మూడు చక్రాల సైకిలు కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. -
ఇరు రాష్ట్రాల మధ్య రోడ్లు అభివృద్ధి చెందాలి
విస్సన్నపేట : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అనుసంధానానికి రహదారులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. విస్సన్నపేట వైపు వెళుతూ ప్రముఖ కాంట్రాక్టర్ చలసాని వెంకటేశ్వరరావు నివాసం వద్ద ఆయన బుధవారం కొద్దిసేపు ఆగారు. విలేకరులతో మాట్లాడుతూ రాజమండ్రి నుంచి సత్తుపల్లికి నేషనల్ హైవే చేశామన్నారు.. అమరావతి నుంచి భద్రాచలానికి జాతీయ రాహదారి ఏర్పాటు జరుగుతుందన్నారు. కల్లూరు నుంచి మచిలీపట్నానికి ఎంఎ¯ŒSకే రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తే మచిలీపట్నం పోర్టుకు భవిష్యత్తులో తెలంగాణ నుంచి అధికంగా రవాణా ఉంటుందని పేర్కొన్నారు. భద్రాచలంరోడ్ నుంచి కొండపల్లికి రైల్వే లై¯ŒS ఏర్పాటుకు తమ ప్రాంతంలో పనులు చేయటం జరుగుతోందని, ఈ ప్రాంతంలో కూడా రైల్వేలైన్లుకు, ఎంఎ¯ŒSకే రహదారి అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం చొరవ చూపితే రెండు రాష్ట్రాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. సత్తుపల్లి వరకు సింగరేణి విస్తరించి ఉంది కాబట్టి పోర్టుకు కాకినాడ కంటే మచిలీపట్నం దగ్గర కనుక ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కాంట్రాక్టర్లు ఎ¯ŒSటీ వెంకటేశ్వరరావు, చలసాని వెంకటేశ్వరరావు, రాంబాబు పాల్గొన్నారు. -
మహిళలపై పెరుగుతున్న దాడులు
విస్సన్నపేట : మహిళలపై దాడులు అరికట్టాలని అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి టి.అరుణ అన్నారు. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఐఫ్వా 4వ జిల్లా మహాసభ ఆదివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ కార్పొరేట్లకు అనుకూల విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న శ్రామిక మహిళలు తక్కువ వేతనాలతో కుటుంబాన్ని మోస్తూ అర్ధాకలితో అలమటిస్తున్నారన్నారు. సమస్యలకోసం పోరాడుతుంటే ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తుందన్నారు. చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ అన్నారు ఇంతవరకు చేయలేదన్నారు. బెల్టు షాపులపై చర్యలు లేవని ఆరోపించారు. మహాసభలో ఐఫ్వా నాయకురాలు మేకల కుమారి, పద్మ, కళావతి, జమలమ్మ, అమల పాల్గొన్నారు. -
అమ్మతనం..
చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని పరీక్ష రాస్తున్న ఈమె పేరు ఇస్లావతుల రాణి. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం చుండ్రుపట్ల గ్రామానికి చెందిన రాణి ఏలూరులోని ఎస్‌పీడీబీటీ కాలేజీలో శనివారం సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష రాయడానికి వచ్చింది. ఆమె భర్త కూడా డీఎస్సీ పరీక్ష రాస్తుండటంతో బిడ్డను చూసే వారు లేక తనతో పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చింది. మరోవైపు టీచర్ నియామకాలకు (డీఎస్సీ-2014) సంబంధించి శనివారం నిర్వహించిన పరీక్షకు 88.66 శాత ం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎస్జీటీ ప్రశ్నపత్రంలో చైల్డ్ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు అభ్యర్థులను బాగా తికమకపెట్టాయి. - నేడు మదర్స్ డే -
86 మంది విద్యార్థులకు అస్వస్థత
విస్సన్నపేట, కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో 86 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈ పాఠశాలలో సుమారు 500 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. శనివారం రాత్రి విద్యుత్తు లేకపోవటంతో వీరు చీకటిలోనే భోజనం చేశారు, కొద్దిసేపటికే ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుంటూ కడుపునొప్పితో బాధపడ్డారు. ఆదివారం ఉదయానికి ఏకంగా 78 మంది కడుపు నొప్పితో బాధపడుతున్నా నిర్వాహకులు పట్టించుకోలేదు. ఆదివారం విద్యార్థులను కలుసుకునేందుకు తల్లిదండ్రులు రావడంతో విషయం బయటపడింది. తల్లిదండ్రులు ఆందోళనతో నిర్వాహకులు 108 వాహనాలకు సమాచారం అందించి విద్యార్థులను మెరుగైన వైద్యంకోసం నూజివీడు తరలించారు. వంటగదిలో, భోజనం హాలులో కరెంటు పోతే చీకట్లో భోజనం పెట్టడం ఏంటని తల్లిదండ్రులు నిర్వాహకులను నిలదీశారు. -
విసన్నపేటలో విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు
కృష్ణాజిల్లా నూజివీడు తాలుకా విసన్నపేటలో పాఠశాలలో పాఠాలు అప్ప చెప్పలేదని ముగ్గురు విద్యార్థులపై ఉపాధ్యాయుడు ఆదివారం తన ప్రతాపం చూపించాడు.ఆ క్రమంలో విద్యార్థులు మర్మావయాలపై దెబ్బలు తెగిలాయి.దాంతో విద్యార్థులకు తీవ్ర రక్తం స్రావమైంది.దీంతో ముగ్గురు విద్యార్థులను విసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఉపాధ్యాయుడు దాడిపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లితండ్రులు పాఠాశాల చేరుకున్నారు.తమ చిన్నారులపై కరక్కశంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు దుర్గారావుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. దాంతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లితండ్రులు నచ్చచెప్పేందుకు యత్నించారు. అయిన వారు వినకుండా విసన్నపేట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు టీచర్ పై కేసు నమోదు చేయాలని విద్యార్థుల తల్లితండ్రులు డిమాండ్ చేశారు.