విసన్నపేటలో విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు | Teacher physically injures 3 students at Vissannapeta school | Sakshi
Sakshi News home page

విసన్నపేటలో విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు

Published Sun, Oct 20 2013 2:19 PM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM

Teacher physically injures 3 students at Vissannapeta school

కృష్ణాజిల్లా నూజివీడు తాలుకా విసన్నపేటలో పాఠశాలలో పాఠాలు అప్ప చెప్పలేదని ముగ్గురు విద్యార్థులపై ఉపాధ్యాయుడు ఆదివారం తన ప్రతాపం చూపించాడు.ఆ క్రమంలో విద్యార్థులు మర్మావయాలపై దెబ్బలు తెగిలాయి.దాంతో విద్యార్థులకు తీవ్ర రక్తం స్రావమైంది.దీంతో ముగ్గురు విద్యార్థులను విసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

అయితే  ఉపాధ్యాయుడు దాడిపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లితండ్రులు పాఠాశాల చేరుకున్నారు.తమ చిన్నారులపై కరక్కశంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు దుర్గారావుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. దాంతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లితండ్రులు నచ్చచెప్పేందుకు యత్నించారు. అయిన వారు వినకుండా విసన్నపేట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు టీచర్ పై కేసు నమోదు చేయాలని విద్యార్థుల తల్లితండ్రులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement