Viral Video: Funny Kid Requesting Teacher Allow To Watch Serials - Sakshi
Sakshi News home page

Funny Video: ‘దండం పెడతా సార్, నన్ను ఇంటికాడ దింపండి, సీరియల్ చూడాలి’

Published Tue, Dec 7 2021 5:00 PM | Last Updated on Tue, Dec 7 2021 7:09 PM

Funny Video Of Boy Requesting Teacher To Drop At Home For Watch Serial - Sakshi

ఇటీవల ‘నా పెన్సిల్‌ దొంగతనం చేసిండు. వీడి మీద కేసు పెట్టండి సార్‌’ అంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఓ బుడ్డోడు మాట్లాడిన మాటలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తన పెన్సిల్‌ను స్నేహితుడు దొంగతనం చేశాడని, అతనిపై కేసు పెట్టాలని, జైల్లో వేయాలని కర్నూలు జిల్లా పెదకడబూరుకి చెందిన హన్మంతు అనే ఆరేళ్ల బాలుడు హంగామా చేస్తాడు. పిల్లాడి అమాయక మాటలు అందరిని నవ్వులు పూయించాయి. తాజాగా అలాంటిదే మరో చిన్న పిల్లాడి వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. 

ఈ వీడియోలో బడికి వెళ్లిన ఓ పిల్లవాడు.. ఇంటికి పంపించమని తన టీచర్‌తో జరిపిన సంభాషణ కడుపుబ్బా నవ్విస్తోంది. మధ్యాహ్నం భోజన సమయంలో సార్ అన్నం తింటుంటే.. ఇంటికి పంపించేయమని ఏడుపు మొదలు పెట్టాడు. , సీరియల్‌ చూసే టైమ్ అయిందని మీరు గబగబా తినేసి తనను ఇంటి దగ్గర దించేయాలని అల్లరి చేశాడు.

మద్యాహ్నం సీరియళ్లు రావని రాత్రి కదా వచ్చేవి అని టీచర్‌ చెప్పడంతో.. ‘మా ఇంట్లో కూడా టీవీ ఉంది. ఇప్పుడు సీరియల్‌ వస్తుంది. మీకు దండం పెడతా సార్… సీరియస్ చూడాలి, నన్ను ఇంటికాడ దింపండి’ అని ఏడుస్తూ అడుగుతుండటం ఫన్నీగా ఉంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. దీనిని చూసిన నెటిజన్లు బుడ్డోడి మాటలకు తెగ నవ్వుకుంటున్నారు. 
చదవండి: నన్ను ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి
చదవండి: వరుడు షాక్‌.. ఇది వధువు చేసిన పనే!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement