ఇరు రాష్ట్రాల మధ్య రోడ్లు అభివృద్ధి చెందాలి
విస్సన్నపేట : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అనుసంధానానికి రహదారులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. విస్సన్నపేట వైపు వెళుతూ ప్రముఖ కాంట్రాక్టర్ చలసాని వెంకటేశ్వరరావు నివాసం వద్ద ఆయన బుధవారం కొద్దిసేపు ఆగారు. విలేకరులతో మాట్లాడుతూ రాజమండ్రి నుంచి సత్తుపల్లికి నేషనల్ హైవే చేశామన్నారు.. అమరావతి నుంచి భద్రాచలానికి జాతీయ రాహదారి ఏర్పాటు జరుగుతుందన్నారు. కల్లూరు నుంచి మచిలీపట్నానికి ఎంఎ¯ŒSకే రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తే మచిలీపట్నం పోర్టుకు భవిష్యత్తులో తెలంగాణ నుంచి అధికంగా రవాణా ఉంటుందని పేర్కొన్నారు. భద్రాచలంరోడ్ నుంచి కొండపల్లికి రైల్వే లై¯ŒS ఏర్పాటుకు తమ ప్రాంతంలో పనులు చేయటం జరుగుతోందని, ఈ ప్రాంతంలో కూడా రైల్వేలైన్లుకు, ఎంఎ¯ŒSకే రహదారి అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం చొరవ చూపితే రెండు రాష్ట్రాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. సత్తుపల్లి వరకు సింగరేణి విస్తరించి ఉంది కాబట్టి పోర్టుకు కాకినాడ కంటే మచిలీపట్నం దగ్గర కనుక ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కాంట్రాక్టర్లు ఎ¯ŒSటీ వెంకటేశ్వరరావు, చలసాని వెంకటేశ్వరరావు, రాంబాబు పాల్గొన్నారు.