
జోధ్‌పూర్/న్యూఢిల్లీ: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’చిత్ర షూటింగ్‌లో బిగ్ బీ అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆయన్ని జోధ్‌పూర్‌లోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అమితాబ్‌కు చికిత్స అందించేందుకు ముంబై నుంచి జోధ్‌పూర్‌కు ప్రత్యేక వైద్య బృందం కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.
వెన్నునొప్పితో బాధ పడుతున్న అమితాబ్ ఇటీవల లీలావతి ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం ఉదయం కూడా పలు ట్వీట్స్ చేసిన అమితాబ్ హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అమితాబ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయన భార్య జయాబచ్చన్ చెప్పారు.