
108లో పుణ్యావతిని తీసుకువస్తున్న 108 సిబ్బంది
ఒడిశా: ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ముందు ఆరు రోజులుగా నిరసన తెలియజేస్తున్న యువతి ఆరోగ్య పరిస్థితి విషమించింది. వివరాల్లోకి వెళ్తే... కొమరాడ మండలం తులసివలస గ్రామానికి చెందిన బొడ్డు రాజశేఖర్ ఇంటి ముందు అతని ప్రియురాలు పుణ్యావతి ఆరు రోజులుగా నిరసన తెలియజేస్తోంది. తన ప్రియుడితో పెళ్లి చేసేంతవరకు అన్నపానీయాలు ముట్టనని భీష్మించుకుని కూర్చున్న యువతి ఆరోగ్యం సోమవారం నాటికి క్షీణించింది. విషయం తెలుసుకున్న సీపీఎం నాయకులు, స్థానికులు ఆమెను 108 వాహనంలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు కొల్లి సాంబమూర్తి, బీవీఆర్ మాట్లాడుతూ, యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కానందున ఎటువంటి చర్యలు తీసుకోలేమని కొమరాడ తహసీల్దార్ సూర్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం పుణ్యావతి పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment