భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త | husband sets wife marriage with her lover | Sakshi
Sakshi News home page

భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త

Published Mon, Mar 12 2018 12:18 PM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM

husband sets wife marriage with her lover - Sakshi

సాక్షి, ఒడిశా : ఓ వ్యక్తి ఏడడుగులు వేసి వివాహం చేసుకున్న ఆరు రోజులకే తన భార్యను కన్యాదానంగా ప్రియునికి ఇచ్చి వివాహం చేసి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుందర్‌ఘడ్ జిల్లాలోని పామర గ్రామానికి చెందిన బాసుదేవ్ టప్పో(28) అనే వ్యక్తి జార్సుగూడ ధేబ్బి గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతిని ఈ నెల 4న వివాహం చేసుకున్నాడు. తన భార్య వేరే యువకుడిని ప్రేమిస్తుందని తెలుకున్న టప్పో వారిద్దరిని ఒక్కటి చేయాలని నిర్ణయించుకున్నాడు. 

తన భార్య తల్లిదండ్రులు, సోదరులతో మాట్లాడి వారిని ఒప్పించాడు. గ్రామ సర్పంచ్‌ సమక్షంలో వారికి మళ్లీ వివాహం జరిపించాడు. ఈ పెళ్లి జరగకుంటే ముగ్గురి జీవితాలు నాశనం అయ్యేవని టప్పో చెప్పాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement