సాక్షి, కల్లూరు : నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రియుడి సాయంతో భర్తను హతమార్చిన సంఘటన మరవకముందే మరో సంఘటన చోటు ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలో జరిగింది. కిరాయి హంతకులతో తాలికట్టిన భర్తను హత్య చేయించింది. ఈ ఘటన కర్నూలు జిల్లా బ్రాహ్మణపల్లెలో ఆలస్యంగా వెలుగు చూసింది. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఈ వివరాలను కర్నూలు డీఎస్పీ ఖాదర్‌బాషా శుక్రవారమిక్కడ వెల్లడించారు. బ్రాహ్మణపల్లెకు చెందిన వడ్డె చిన్న మద్దిలేటి అలియాస్ మద్దయ్య(35) తన అక్క కుమార్తె వెంకటేశ్వరమ్మను ఆరేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
కాగా, వెంకటేశ్వరమ్మకు రెండేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన ముల్ల మహబూబ్‌బాషాతో పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న మద్దయ్య.. తరచూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో వెంకటేశ్వరమ్మ.. ప్రియుడు మహబూబ్‌బాషాతో కలిసి మద్దయ్య హత్యకు కుట్ర పన్నింది. బేతంచెర్ల మండలం బలపాలపల్లెకు చెందిన మనోహర్‌తో లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా రూ.80 వేలు ముట్టజెప్పారు. దీంతో మనోహర్ నిత్యం మద్దయ్యకు మందు తాగిస్తూ.. సన్నిహితుడిగా మారాడు. ఈ నెల 4వ తేదీ రాత్రి మద్దయ్యను పూడిచెర్లకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. మత్తులో ఉన్న మద్దయ్యను బలపాలపల్లెకు చెందిన మల్లికార్జున సాయతో ముఖంపై బండరాయితో మోది హతమార్చాడు. నిందితులు వెంకటేశ్వరమ్మ, ఆమె ప్రియుడు మహబూబ్‌బాషా, మనోహర్, మల్లికార్జునను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కర్నూలు జిల్లాలో మరో స్వాతి
Comments
Please login to add a commentAdd a comment