After One Month Of Marriage, Young Woman Remarried Her Boyfriend In Vellore - Sakshi

Tamil Nadu: పెళ్లైన నెలకే భర్తకి షాక్‌.. ప్రియుడితో కలిసి..

Mar 18 2022 6:47 AM | Updated on Mar 18 2022 9:21 AM

Tamil Nadu: Woman Left Husband And Married Lover - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువణ్ణామలై(వేలూరు): వివాహం జరిగిన ఒక నెల రోజుల్లోనే భర్తను కాదనుకున్న ఓ యువతి తన ప్రియున్ని రెండవ వివాహం చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. తిరువణ్ణామలై జిల్లా వేంగికాల్‌ గ్రామానికి చెందిన ఒక యువతి అదే గ్రామానికి చెందిన బంధువుల యువకుడితో పెద్దలు సంబంధం కుదిర్చి నెల కిందట వివాహం జరిపించారు. అయితే పెళ్లి అయినప్పటి నుంచి ఆమె మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. (చదవండి: యోగిజీ ఎఫెక్ట్‌: ప్లీజ్‌.. చంపొద్దు కావాలంటే జైల్లో పెట్టండి )

అయితే మంగళవారం ఉదయం ఇంటిలో ఉన్న యువతి ఉన్న ఫలంగా మాయమైంది. దీంతో ఆ యువతిని భర్తతో పాటు బంధువులు ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియలేదు. ఇదిలా ఉండగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ యువతి తన ప్రియున్ని వివాహం చేసుకుని వెళ్లిపోయినట్లు తెలియడంతో భర్తతో పాటు బంధువులు అవాక్కయ్యారు. రెండోవివాహం చేసుకున్న ఆ యువతి ప్రియుడితో కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ తిరువణ్ణామలై తాలుకా పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అక్కడి పోలీసులు ఈ విషయాన్ని కోర్టులో నిర్ణయించుకోవాలని సలహా ఇచ్చి పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement