
హత్యకు గురైన వనిత పోలాయి మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
బరంపురం ఒరిస్సా : గంజాం జిల్లా బుగడ బ్లాక్‌లోని ఆశ్రయ కరబడి గ్రామంలో ప్రేమికురాలి గొంతుకోసి హత్య చేసిన ఘటన గురువారం చోటు చేసుకుం ది. ఐఐసీ అధికారి సమచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుగడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆశ్రయకరబడి గ్రామంలో నివాసం ఉంటున్న వనితా పోలాయిని అనే మహిళ అదే గ్రామానికి చెందిన నిల్లు జెనా కొద్దిరోజుల క్రితం ప్రేమించుకున్నారు.
అయితే ఇదే సమయంలో ఆ యువతికి వేరే వ్యక్తితో పెద్దలు వివాహం జరిపించారు. ప్రస్తుతం ఆషాడమాసం కావడంతో 10 రోజుల క్రితం యువతి ఆశ్రయకరబడి గ్రామానికి వచ్చింది. తన ప్రియురాలు వనిత గ్రామానికి వచ్చినట్లు తెలుసుకున్న ప్రియుడు నీలు జెనా గ్రామానికి వచ్చి గురువారం ఉదయం కత్తితో యువతి గొంతుకోసి హత్యచేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న బుగడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment