
నటుడు రితీశ్‌కు అస్వస్థత
తమిళసినిమా: నటుడు, రాజకీయ నాయకుడు రితీశ్ గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారు. రితీశ్ కానల్‌నీర్, నాయగన్, పెన్‌సింగం తదితర చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్న రితీశ్ డీఎంకే తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అనంతరం అన్నాడీఎంకేలో చేరారు. రెండు రోజుల క్రితం జిమ్‌కు వెళ్లినప్పుడు హఠాత్తుగా గుండెపోటు రావడంతో నిర్వాహకులు మైలాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అత్యవసర విభాగంలో చికిత్సలు పొందుతున్నారు. అధిక రక్తపోటు కారణంగానే రితీశ్ అనారోగ్యానికి గురయ్యాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.