రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆదివారం తెల్లవారు జామున అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆయన్ను రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రి వైద్యులు జగ్గిరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది.