కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి అస్వస్థత
కొత్తపేట : వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన కొత్తపేట(తూర్పు గోదావరి) ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ నిర్విరామం గా అనేక అధికారిక, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఓ కార్యకర్తను పరామర్శిం చేందుకు రాత్రి ఆత్రేయపురం వెళుతున్న సమయంలో ఆయన ముక్కుపుటాల నుంచి రక్తం స్రవించింది. దాన్ని తుడుచుకుంటుండగానే స్రావం తీవ్రమై నేప్‌కిన్‌తో పాటు షర్టు, ప్యాంటు రక్తంతో తడిసిపోయాయి.
ఆయన తో ఉన్న నాయకులు, సన్నిహితులు ఆందోళనకు గురై వెంటనే రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కార్డియాలజిస్టు ఎన్‌ఎస్ రామరాజు పర్యవేక్షణలో రక్తస్రావాన్ని అరికట్టేందుకు చికిత్స చేశారు. విపరీతమైన అలసట, రక్తపోటు పెరగడం వల్ల రక్తస్రావమైనట్టు నిర్ధారించిన వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచిం చారు. ఈఎన్‌టీ స్పెషలిస్టు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా జగ్గిరెడ్డికి వివిధ పరీక్షలు జరి పారు. స్వస్థత చేకూరడంతో జగ్గిరెడ్డి ఆది వారం మధ్యాహ్నం గోపాలపురంలోని స్వగృహానికి తిరిగి వచ్చారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉద యం జగ్గిరెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. ఏ విషయంలోనూ ఒత్తిడికి లోనుకావద్దని సూచించారు. వాకింగ్, యోగా, మెడిటేషన్ వంటివి చేయాలని, హైదరాబాద్ వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యేలు, నాయకుల పరామర్శ
అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పరామర్శించారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పినిపే విశ్వరూప్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, పార్టీ నాయకులు కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, వరుపుల సుబ్బారావు తదితరులు ఫోన్‌లో పరామర్శించారు. జగ్గిరెడ్డిని పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, కొల్లి నిర్మలకుమారి, జక్కంపూడి రాజా, జక్కంపూడి చిన్ని ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, టీడీపీ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, బండారు సత్తిబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ కోరం జయకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు ధర్నాల రామకృష్ణ, ఆలమూరు ఎంపీపీ కొత్తపల్లి వెంకటలక్ష్మి దుర్గారావు తదితరులు ఉన్నారు.