
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మాళ్లపల్లిలో కల్తీసారా తాగి 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు బుధవారం ఆస్పత్రిలో మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన ఎనగందుల పోశం, మల్లక్క, నిమ్మలగూడంలో ఆత్రం సత్యవార్, ఆత్రం సునీల్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎర్రోళ్ల లస్మయ్య, ఒడిపిలవంచకు చెందిన బండి సమ్మయ్య, రాములు, మరో ఇద్దరు గ్రామంలోని సమ్మక్క అనే మహిళ వద్ద సారా తాగారు. ఇందులో సునీల్, సత్యవార్ సోమవారం సారా తాగగా, మిగిలిన వారు మంగళవారం సాయంత్రం సారా తాగారు.
తాగిన కొంత సమయానికే వారు వాంతులు, విరేచనాలకు లోనయ్యారు. పోలీసులు వెంటనే బాధితులను మండల కేంద్రం లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇందులో ఎలగందుల పోశం, మల్లక్క, ఎర్రోళ్ల లస్మయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం, పరకాల ఆస్పత్రులకు తరలించారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా సోమన్ పల్లివాసి ఏర్రోళ్ల లస్మయ్య(45) పరకాల ఆస్పత్రిలో చనిపోయాడు. సత్యవార్ పరిస్థితి విషమంగా ఉంది. హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెం టిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment