న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ(70) శుక్రవారం అస్వస్థతకు లోనయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కడుపు నొప్పి రావడంతో ఆమెను ఎయిర్ అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు.
ఈ విషయమై గంగారామ్ ఆస్పత్రి చైర్మన్ డా.డీఎస్ రానా మీడియాతో మాట్లాడుతూ.. సోనియా సాయంత్రం 5 గంటల సమయంలో కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరారన్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీటర్‌లో స్పందిస్తూ.. సోనియా పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. ‘సిమ్లాలో అమ్మ(సోనియా)కు కడుపు నొప్పి రావడంతో వెంటనే ఢిల్లీకి తీసుకొచ్చాం. భయపడాల్సిందేమీ లేదు. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. మీ అద్భుతమైన ప్రేమ, ఆప్యాయతలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment