gangaram hospital
-
ఈడీ విచారణ: సోనియా గాంధీని కలుసుకున్న రాహుల్
న్యూఢిల్లీ: ఈడీ విచారణ మధ్యలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(51), తన తల్లి సోనియా గాంధీని కలుసుకున్నారు. కొవిడ్ బారిన పడ్డ సోనియా గాంధీ ప్రస్తుతం గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో సోమవారం ఈడీ విచారణ జరుగుతున్న సమయంలోనే.. మధ్యాహ్నం భోజన విరామం ఇచ్చారు ఈడీ అధికారులు. దీంతో ఇంటికి వెళ్లి భోజనం చేసి.. ఆపై సోదరి ప్రియాంకతో కలిసి రాహుల్ గాంధీ, గంగారాం ఆస్పత్రికి వెళ్లారు. సోనియాను వాళ్లు పరామర్శించినట్లు తెలుస్తోంది. ఇక లంచ్ బ్రేక్ తర్వాత రాహుల్ గాంధీ, తిరిగి ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం రెండో విడత విచారణ కొనసాగుతోంది. చదవండి: సోనియా ఫ్యామిలీపై ఈగ వాలినా ఊరుకునేది లేదు -
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
-
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(75) ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ధృవీకరించారు. ఈమధ్యే ఆమె కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. కరోనా సంబంధిత సమస్యలతోనే సోనియా, ఢిల్లీ గంగారామ్ ఆస్పత్రిలో ఆదివారం చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, అబ్జర్వేషన్లో ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్‌తో పాటు పలువురు రాజకీయ పార్టీ ప్రతినిధులు సోషల్‌మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. Congress interim president Sonia Gandhi admitted to Ganga Ram Hospital today owing to Covid-related issues. She is stable and will be kept at the hospital for observation, says Congress leader Randeep Singh Surjewala pic.twitter.com/AkDP5ncMg8 — ANI (@ANI) June 12, 2022 -
ఢిల్లీలో ఆగని మృత్యుఘోష
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆస్పత్రుల్లో ప్రాణవాయువు నిండుకుంది. దీంతో ఆస్పత్రుల్లో అత్యవసర విభాగాల్లో కృత్రిమ ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్న రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. శుక్రవారం గంగారాం ఆస్పత్రిలో 25 మంది రోగులు ఆక్సిజన్ అందక మరణించిన ఘటన మరవకముందే ఢిల్లీలో శనివారం మరో ఘోరం జరిగింది. ఢిల్లీలోని తమ ఆస్పత్రిలో 20 మంది రోగులు ఆక్సిజన్ సరిపడ పీడనంతో సరఫరా కాకపోవడంతో కన్నుమూశారని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డీకే బలూజా చెప్పారు. శనివారం ఉదయం 11 గంటల సమయానికి మా ఆస్పత్రిలో 200 మంది రోగులున్నారని, కేవలం అరగంటకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే తమ వద్ద ఉందని ఆయన వెల్లడించారు. వీరిలో 80 శాతం మంది రోగులకు కృత్రిమ ఆక్సిజన్ అవసరమని, మిగతా వారిని ఐసీయూలో ఉంచామని చెప్పారు. ఇంకా కష్టాల్లోనే గంగారాం ఆస్పత్రి ‘మాకు రోజుకు 11వేల ఘనపు మీటర్ల ఆక్సిజన్ అవసరం. కానీ మా వద్ద కేవలం 200 ఘనపు మీటర్ల ఆక్సిజన్ ఉంది. రోగులు తమ సొంత ఆక్సిజన్ సిలిండర్లతో ఆస్పత్రిలో చేరుతున్నారు. అందరు ఉన్నతాధికారలు, నోడల్ అధికారులను కలిశాం. వందల ఫోన్‌కాల్స్ చేశాం. స్పందన శూన్యం. మరో రెండు గంటల్లో ఆక్సిజన్ అయిపోతుంది’ అని పరిస్థితిని గంగారాం ఆస్పత్రి చైర్పర్సన్ డీఎస్ రాణా వివరించారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత అత్యంత తీవ్రమవడంతో కోవిడ్ బాధితుల మరణాలు పెరుగుతున్నాయి. చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ సాయంచేయండంటూ ఢిల్లీ ఆస్పత్రులు సామాజిక మాధ్యమాల వేదికగా వేడుకుంటున్నాయి. ఏదో విధంగా ఆక్సిజన్ సరఫరాపై చర్యలు తీసుకోండంటూ మహారాజా అగ్రసేన్ ఆస్పత్రి, జైపూర్ గోల్డెన్ ఆస్పత్రి, బాత్రా ఆస్పత్రి, సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల యాజమాన్యాలు ఢిల్లీ హైకోర్టు తలుపుతట్టాయి. దీంతో ఢిల్లీ హైకోర్టు ఘాటుగా స్పందించింది. ‘ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాను పెంచాలి. లేదంటే ఆక్సిజన్సరఫరాను అడ్డుకునే ఏ వ్యక్తినైనా సరే మేం ఉరితీస్తాం. ఎవరికీ వదిలిపెట్టం’ అని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీకి రోజుకు 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తామని కేంద్రప్రభుత్వ హామీ ఇచ్చింది. కానీ గత కొద్ది రోజులుగా 380 మెట్రిక్ టన్నులఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. శుక్రవారం కేవలం 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందిందని ఢిల్లీ సర్కార్ చెబుతోంది. వాల్వ్ మూసేయడంతో ఇద్దరి మృత్యువాత మహారాష్ట్రలోని బీడ్ జిల్లా సివిల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. రోగులకు ఆక్సిజన్‌ను పంపిణీ చేసే వాల్వ్‌ను ఎవరో మూసేయడంతో చికిత్స పొందుతున్న ఇద్దరు కోవిడ్ పేషెంట్లు మరణించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వాల్వ్ మూసేసి ఉన్న సమయంలో ఏ రోగీ కృత్రిమ ఆక్సిజన్‌పై లేరని ఆస్పత్రి సిబ్బంది చెబుతుండగా, ఆక్సిజన్ సరఫరా ఒక్కసారిగా ఆగిపోవడంతోనే ఇద్దరూ మరణించారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగనుంది. పంజాబ్‌లో ఆరుగురి మృతి కోవిడ్ బాధితులకు సరిపడ ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. అమృత్‌సర్‌లోని నీలకంఠ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు కోవిడ్ బాధితులు శనివారం ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో మరణించారు. ఆక్సిజన్ కొరతపై సంబంధిత అధికారులకు తెలిపినా ఎవరూ స్పందించలేదని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. అయితే, ఆక్సిజన్ కొరత తీవ్రతను పేర్కొనలేదని, కేవలం సంబంధిత వాట్సప్ గ్రూప్‌లో ఒక చిన్న మెసేజ్ మాత్రమే ఆస్పత్రి యాజమాన్యం పంపిందని రాష్ట్ర వైద్య విద్య మంత్రి చెప్పారు. మృతి ఘటనపై పంజాబ్ సీఎం విచారణకు ఆదేశించారు. -
సోనియాకు అస్వస్థత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ(70) శుక్రవారం అస్వస్థతకు లోనయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కడుపు నొప్పి రావడంతో ఆమెను ఎయిర్ అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై గంగారామ్ ఆస్పత్రి చైర్మన్ డా.డీఎస్ రానా మీడియాతో మాట్లాడుతూ.. సోనియా సాయంత్రం 5 గంటల సమయంలో కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరారన్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీటర్లో స్పందిస్తూ.. సోనియా పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. ‘సిమ్లాలో అమ్మ(సోనియా)కు కడుపు నొప్పి రావడంతో వెంటనే ఢిల్లీకి తీసుకొచ్చాం. భయపడాల్సిందేమీ లేదు. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. మీ అద్భుతమైన ప్రేమ, ఆప్యాయతలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. -
స్థిరంగా సోనియాగాంధీ ఆరోగ్యం
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐసీసీ మీడియా విభాగం ఇన్చార్జి రణ్‌దీప్ సుర్జేవాలా బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఆమెకు గంగారామ్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని వెల్లడించారు. తీవ్రమైన జ్వరం కారణంగా మంగళవారం వారణాసిలో తన రోడ్‌షోను సోనియాగాంధీ అర్ధంతరంగా ముగించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆమె చార్టెడ్ విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వెంటనే ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరెల్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం పరిస్థితి మెరుగవడంతో ఆమెను గంగారామ్ ఆసుపత్రికి మార్చినట్లు సుర్జేవాలా చెప్పారు. తను అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ సోనియాగాంధీ ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపినట్లు ఆయన చెప్పారు. కాగా, సోనియా వద్ద ప్రస్తుతం ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ ఉన్నారు.