విద్యార్థులకు అస్వస్థత | Students sickness | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు అస్వస్థత

Published Sun, Nov 30 2014 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

Students sickness

 కట్టంగూర్ : మధ్యాహ్న భోజనం వికటించి 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మండలంలోని అయిటిపాముల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. ఈ విద్యా సంవత్సనం ప్రారంభం నుంచి పాఠశాలలో భోజన ఎజెన్సీల మధ్య గొడవలు జరుగుతున్నాయి.  ఈ గొడవల కారణంగా ఇదే పాఠశాలలో జులై 19, 2014న ఫుడ్ పాయిజన్ కావటంతో 42 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. దీంతో మూడు నెలలుగా పాఠశాల ఎస్‌ఎంసీ కమి టీ ఆధ్వర్యంలో వంట చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. చెర్వుఅన్నారం ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటన  ఒక్క రోజైనా పూర్తి కాకముందే అయిటిపాములో రెండోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అధికారుల పర్యవేక్షణ, సంఘాల మధ్య గొడవల కారణంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. వారం రోజు లుగా నూతన సంఘాలైన తిరుపతమ్మ, వరలక్ష్మి, లక్ష్మినర్సింహ్మ సంఘాలు వంట చేస్తున్నారు. శనివారం వంటల సమయం లో పప్పుదోసకాయ కూరలో సాంబారు మసాలకు బదులుగా చికెన్ మసాలా, పొ ట్లాల్లో తెచ్చిన కారాన్ని వేసి కూరను వండి విద్యార్థులకు వడ్డించారు.
 
 దోసకాయ ముక్కలు సరిగ్గా ఉడక లేదని విద్యార్థులు తెలిపారు. అన్నం తిన్న విద్యార్థులు తర గతి గదిలోకి వెళ్లి కూర్చున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో 6 నుంచి 9వ తరగతి వరకు 31,10వ తరగతి విద్యార్థి ఒక్క రు చొప్పున విద్యార్థులు కడుపునొప్పి, తల నొప్పితో పాటు వాంతులు చేసుకున్నారు. ఇది గమినించిన పాఠశాల హెచ్‌ఎం రేణుకాదేవి 108 వాహనంలో32 మంది విద్యార్థులను నకిరేక ల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. ఆసుపత్రిలో 14 మంది బాలికలు, 18 మంది బాలురకు వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులంతా క్షేమంగా ఉండటంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. విష యం తెలుసుకున్న డీఈఓ విశ్వనాథరావు, జెడ్పీటీసీ మాద యాదగిరి, ఎంపీపీ కొండ లింగస్వామి, ఎంఈఓ బి.మోహన్‌రెడ్డి, సర్పంచ్ పెద్ది మంగమ్మసుక్కయ్య, ఊ ట్కూరి ఏడుకొండలు, నిమ్మనగోటి సైదులు విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
 
 బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: డీఈఓ విశ్వనాథరావు
 విద్యార్థుల పట్ల అలసత్వంగా వ్యహరించిన వారిని కఠినంగా శిక్షిస్తాము. డిప్యూటీ డీఈ ఓతో విచారణ చేయిస్తాం, కలెక్టర్‌కు ఫిర్యా దు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాండా చూస్తాం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement