దుబాయ్: ప్రపంచంలోనే సుదీర్ఘకాలం ప్రధాన మంత్రిగా కొనసాగిన 84 ఏళ్ళ బహ్రెయిన్ రాజు షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా బుధవారం మరణించారు. గత కొంతకాలంగా అనా రోగ్యంతో బాధపడుతోన్న ఖలీఫా అమెరికాలోని మేయో క్లినిక్‌లో చికిత్సపొందుతూ మరణిం చినట్లు బహ్రెయిన్ ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఖలీఫా దేశ విదేశాల్లో అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని షియాలు 2011లో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ఈ ఉద్యమకారులను ఖలీఫా తీవ్రంగా అణచివేసి, తన పదవిని కాపాడుకోవడంలో కృతకృత్యులయ్యారు. ఈయన అత్యంత సంపన్నవంతుడు. విదేశీ ప్రతినిధులను కలవడానికి, ప్రత్యేకంగా తన సొంత దీవిలో సమావేశాలు నిర్వహించేవారు. బహ్రెయిన్‌ను 200 ఏళ్ల కు పైగా పరిపాలించిన అల్ ఖలీఫా వంశంలో ఈయన జన్మించారు.
Comments
Please login to add a commentAdd a comment