పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం లభించకముందు అక్కడ హిందువుల సంఖ్య భారీగానే ఉండేది. దీంతో అక్కడ వారికి తగిన ప్రాధాన్యత లభించేది. స్వాతంత్ర్యం అనంతరం పాక్ ప్రత్యేక దేశంగా అవతరించింది. అదేసమయంలో అక్కడ ఉంటున్న హిందువులు భారత్‌కు తరలివచ్చారు. కొద్దిమంది మాత్రం పాకిస్తాన్‌లోనే ఉండిపోయారు. వారిలో హిందూ రాజులు కూడా ఉన్నారు. వారిలో ఒకరే పాకిస్తాన్‌లోని అమర్‌కోటకు చెందిన హిందూ రాజు రాణా చంద్ర సింగ్. ఇతనే తొలిసారిగా 1990లో పాకిస్తాన్‌లో పాకిస్తాన్ హిందూ పార్టీని స్థాపించారు.
నాడు పాకిస్తాన్‌లో అమర్ కోటగా పిలిచే ప్రాంతాన్ని నేడు ఉమర్‌కోటగా మార్చారు. రాణా చంద్ర సింగ్ అక్కడే రాజుగా ఉండేవారు. పాక్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అక్కడి హిందువులకుపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్న విషయాన్ని గమనించిన రాజపూత్ వంశస్థుడైన రాణా చంద్ర సింగ్ పాకిస్తాన్ హిందూ పార్టీని నెలకొల్పారు. అయితే పార్టీకి ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. పాకిస్తాన్‌లోని హిందువులు పార్టీకి తగినంత అండనివ్వలేదు.
రాజకీయ విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పార్టీలోని కీలకపదవులను రాణా చంద్ర సింగ్ కుటుంబ సభ్యులు, పాక్‌లోని అగ్రవర్ణాల వారు ఆక్రమించారు. అప్పట్లో పాక్‌లోని హిందూ ఓటర్లలో అత్యధికులు కింది వర్గాలకు చెందినవారే ఉన్నారు. దీంతో వారు ఈ పార్టీతో అనుసంధానం కాలేకపోయారు. ఫలితంగా పార్టీ ఎంత గొప్పగా ప్రారంభమయ్యిందో అంత వేగంగానే పతనమయ్యింది.
పాకిస్తాన్ హిందూ పార్టీకి చెందిన జెండా హిందూ చిహ్నాలతో కూడి ఉంటుంది. కాషాయవర్ణంలోని జెండాపై త్రిశూలం గుర్తు కనిపిస్తుంది. అలాగే ఓంకారం కూడా ఉంది. ప్రస్తుతం ఈ పార్టీ మనుగడలో లేదు. అయితే ఈ పార్టీని స్థాపించిన రాణా చంద్ర సింగ్ కుమారుడు రాణా హమీర్ సింగ్ రాజకీయాల్లో యాక్టివ్‌గానే ఉన్నారు. ఆయన సింధ్ ప్రాంతానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సింధ్‌లో ఆయన పలుకుబడి కలిగిన వ్యక్తిగా పేరుగాంచారు.
ఇది కూడా చదవండి: మరో ‘పబ్జీ’ దారుణం: తల్లిదండ్రులపై దాడికి తెగబడి..
Comments
Please login to add a commentAdd a comment