సాక్షి, విశాఖపట్నం: ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. వివాదాలకు తావులేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందన్నారు.
కాగా, మంత్రి బొత్స గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బ తీసేలా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారు. ఈసైన్ ద్వారా, ఆధార్ అతంటికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మెమోలో ఉన్నది ఒక్కటైతే.. విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నారు.
దేశమంతా ఈ చట్టం అమలు చేయాలని కేంద్రప్రభుత్వమే సూచించింది. వివాదాలకు తావులేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగింది. దళారి వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నాము. భూమి పేపర్లకు జిరాక్స్ పేపర్లు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జిరాక్స్ పేపర్లు ఇస్తారు అనేది అబద్ధం. ఎన్నికల కోడ్ లేకపోతే తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోనే వాళ్లం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రలకు సలహాలు సూచనలు ఇచ్చింది. ఇంకా యాక్ట్ రాలేదు, రాని యాక్ట్‌ను తొలగిస్తామని చంద్రబాబు చెబుతున్నాడు.
యాక్ట్‌పై అమలు చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తాము. చంద్రబాబు, పవన్, రామోజీరావు, రాధాకృష్ణ క్రిమినల్స్‌లాగా మాట్లాడుతున్నారు. ప్రజల ఆస్తులకు మరింత రక్షణ కల్పించాలనేది సీఎం జగన్ ఆలోచన. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై మూడు సార్లు అసెంబ్లీలో చర్చ జరిగింది.
2014లో చంద్రబాబు 50 పేజీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. సీఎం జగన్ నాలుగు పేజీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ పథకాలను, మేనిఫెస్టో పేజీలను చంద్రబాబు కాఫీ కొట్టారు. టీడీపీ మేనిఫెస్టో చెత్త బుట్టలో వేయడానికి తప్ప దేనికి పనికి రాదు. టీడీపీ మేనిఫెస్టోపై మోదీ, పురంధేశ్వరి బొమ్మలు ఎక్కడ ఉన్నాయి. మంచి పని చేస్తున్న సీఎం జగన్ ఫోటో సర్వే రాళ్ళు మీద వేస్తే తప్పేంటి’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment