జోహెన్నస్‌బర్గ్: చంద్రుని దక్షిణ ధృవంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారత్ సమిష్టిగా చరిత్ర సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ.. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై కాలుమోపిన క్షణాన్ని వీక్షించారు. భారత్ గౌరవించదగిన విషయమని ప్రధాని మోదీ అన్నారు.
"ఈ విజయంపై ఇస్రోను, శాస్త్రవేత్తలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను దక్షిణాఫ్రికాలో ఉండవచ్చు కానీ నా హృదయం ఎల్లప్పుడూ చంద్రయాన్ మిషన్‌తో ఉంటుంది. చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపాం. ఇప్పటివరకు ఏ దేశం కూడా ఈ ఘనత సాధించలేదు. సరికొత్త చరిత్రకు అధ్యాయం ప్రారంభమైంది." అని దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్ ప్రసంగంలో ప్రధాని మోదీ అన్నారు.
ఈ విజయంతో భారత్.. అంతరిక్ష రంగంలో చైనా, రష్యా, అమెరికా సరసన చేరింది. చంద్రునిపై ల్యాండింగ్ చేసిన ఘటన ఇప్పటివరకు ఈ మూడు దేశాలకే ఉండేది. తాజాగా చంద్రయాన్ 3తో భారత్ కూడా చేరింది.
Congratulations @isro #Chandrayaan3 #IndiaOnTheMoon #PMModi #NarendraModi #PMOIndia #Congratulations #isrochandrayaan3mission @narendramodi pic.twitter.com/mVfQZAIF1V
— Aryan S Prince (@aryansprince49) August 23, 2023
చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసిన అద్భుత ఘట్టం ఆవిషృతమైంది. 2019లో చంద్రయాన్ 2 విఫలమైన తర్వాత ఈ మిషన్‌ను ఛాలెంజ్‌గా తీసుకోవడం, అటు.. రష్యా లూనా 25 ఇటీవల ఫెయిలవడంతో యావత్ ప్రపంచం చంద్రయాన్ 3వైపు ఆసక్తిగా చూసింది.
ఇదీ చదవండి: చంద్రయాన్-3 ఆ విజయం వెనక మేధస్సు వీరిదే
Comments
Please login to add a commentAdd a comment