ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలతో నిరంతరం సింగపూర్ లోని తెలుగు వారి కోసం సేవ చేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం వారి ఆద్వర్యంలో మనబడి తెలుగు విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంబమైన కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది.
మెరీనా బే సాండ్స్ ఎగ్జిబిషన్ హాల్లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 2022-23, 2023-24 విద్యా సంవత్సరములలో ప్రవేశం, ప్రస్తుత తరగతుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా తెల్లటి పైకండువా కప్పి, మెడల్ తోపాటు సిలికానాంధ్ర, సింగపూర్ తెలుగు సమాజం స్నాతకోత్సవ ధృవపత్రాలను బహుకరించినట్లు కార్యక్రమ నిర్వాహకులు స్వామి గోపి కిషోర్ తెలిపారు. మంచి అభిరుచితో తెలుగు నేర్చుకుంటున్న విద్యార్థులను అభినందిస్తూ, మనబడి కార్యక్రమానికి సహకారం అందిస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాస రెడ్డి ప్రారంభోన్యాసంలో ఈ తరం వారికి తెలుగు భాష అవసరాన్ని తెలుపుతూ అందరూ సమాజం సభ్యులుగా చేరి ఆ రకంగా తెలుగు సమాజం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
NRI ONE స్థిరాస్తి విక్రేతలు అందించిన సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి, స్థానిక GIG అంతర్జాతీయ పాఠశాల ఎక్జిక్యూటివ్ డైరక్టర్ సాంబశివ రావు ముఖ్య అతిథి గా విచ్చేసి ఉపాధ్యాయులకు జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాతృభాష ఉన్నతి కోసం కృషి చేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గాన్ని, నిస్వార్ధంతో సేవ చేస్తున్న ఉపాధ్యాయులను అభినందిస్తూ భవిష్యత్తులో మనబడి కార్యక్రమానికి అవసరమైన సహాయ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
తెలుగు బడి విద్యార్థులు ప్రదర్శించిన పద్య పఠనం, తెలుగు పాటలు, శాస్త్రీయ సంగీతం, నాట్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన చాణక్య సభికులను ఆకట్టుకుంటూ కార్యక్రమం ఆద్యంతం క్రమపద్ధతిలో జరిగేలా సహకరించారు. ఈ సందర్భంగా జీఐజీ రావు గారికి, NRI ONE శేఖర్‌కి జ్ఞాపికను బహుకరించారు.
అనంతరం సింగపూర్ తెలుగు సమాజం గౌరవ కార్యదర్శి అనిల్ కుమార్ పోలిశెట్టి వందన సమర్పణ చేస్తూ కార్యక్రమం విజయవంతం చేయటానికి సహకరించిన, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, NRI ONE వారికి, GIG రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మనబడి కార్యక్రమాలను మరింత మంది ఉపయోగించుకుని తద్వారా మాతృభాష అభివృద్ధికి దోహదం చేయాలని కోరారు.
ఉపాధ్యక్షులు పాలెపు మల్లికార్జున్, కురిచేటి జ్యోతీశ్వర్ కార్యక్రమానికి మొదటి నుండి సహకారం అందిస్తూ వెన్నంటి నిలిచారు. కార్యక్రంలో సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం శ్రీనివాసరెడ్డి పుల్లన్నగారి, టేకూరి నాగేష్, కురిచేటి స్వాతి, వైదా మహేష్, కొత్త సుప్రియ పాల్గొని సహకారం అందించారు. ఉపాధ్యాయులు ప్రతిమ, దేదీప్య, శ్రీలక్ష్మి, కిరణ్ కుమార్, గోపి క్రిష్ణ, రంగనాధ్, గీత, శ్రీలత, విజయ వాణి విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందచేసారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా 200 మంది, పరోక్షంగా 4000 మంది వీక్షించినట్లు నిర్వహకులు తెలిపారు.
(చదవండి: అయోవాలో ప్రారంభమైన నాట్స్ ప్రస్థానం)
Comments
Please login to add a commentAdd a comment