మాట్లాడుతున్న డాక్టర్ లింబాద్రి, చిత్రంలో సొసైటీ వైస్ చైర్మన్, కాలేజీ ప్రతినిధులు
నర్సాపూర్ : ఇంజనీరింగ్ విద్యార్థులు సాంప్రదాయ కోర్సులతోపాటు ఆధునిక కోర్సులను చదవాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.లింబాద్రి అన్నారు. ఆదివారం నర్సాపూర్‌లోని బీవీ రాజు ఇంజినీరింగ్ కాలేజీలో 8వ స్నాతకోత్సవం ఏర్పాటు చేయగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాంప్రదాయ కోర్సులైన మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌లతో పాటు పాటు ఫార్మా రంగాలకు మంచి భవిష్యత్ ఉందని, నూతన కంప్యూటర్ కోర్సులను చదవాలన్నారు. విద్యార్థులకు మంచి విద్యతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థల్లో బీవీఆర్‌ఐటీ ఒకటని ఆయన కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు.
స్నాతకోత్సవంలో పాల్గొన్నందుకు తనకు సంతోషంగా ఉందని వివరిస్తూ విద్యార్థులు మంచి నడవడికతో దేశానికి, సమాజానికి సేవా భావం కల్గి ఉండాలని, నిజాయితీగా ఉండాలని హితవు పలికారు. ఆయా కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మిప్రసాద్, కాలేజీలోని పలు బ్రాంచ్‌ల హెచ్‌ఓడీలు, కాలేజీ డీజీఎం కాంతారావు, ఏఓలు బాపిరాజు, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బందితో కలిసి ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment