ఒడిషాలోని ఓ ప్రైవేటు టీవీ ఛానల్లో పనిచేస్తున్న పాత్రికేయుడు దారుణ హత్యకు గురయ్యాడు.
ఒడిషాలోని ఓ ప్రైవేటు టీవీ ఛానల్లో పనిచేస్తున్న పాత్రికేయుడు దారుణ హత్యకు గురయ్యాడు. బెరహంపూర్కు చెందిన తపస్ ఆచార్య (34) మృతదేహం ఖల్లికోటె పోలీసు స్టేషన్కు సమీపంలో రోడ్డుపక్కన పడి ఉండగా గుర్తించారు. తపస్ మెడ మీద గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తన డ్యూటీ ముగించుకుని ఖల్లికోటేకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామానికి వస్తుండగా అతడు హత్యకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నిందితులు పదునైన ఆయుధం లేదా కత్తిని ఉపయోగించి ఉంటారని ఛత్రపూర్ డీఎస్పీ ఏసీహెచ్ పాహి తెలిపారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిపారు. గంజాం జిల్లాలోని పాత్రికేయ సంఘాలు ఈ హత్యను తీవ్రంగా ఖండించాయి.