![A Baby Born With Genetic Defects In Odisha - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/23/baby.jpg.webp?itok=fYT_2USW)
సాక్షి, బరంపురం (ఒడిశా): నగరంలోని ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో ఓ మహిళ వింత శిశువుకి గురువారం జన్మనిచ్చింది. బట్టకుమరా గ్రామానికి గర్భిణికి ఉదయం పురిటినొప్పులు రావడంతో ఆమెని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో 2.40 కిలోల బరువున్న శిశువుకి ఆమె జన్మనివ్వగా, శిశువు తల పంది తల ఆకారంలోనూ, చర్మంపై పొలుసులు ఉండి అవి ఊడిపోతున్నట్లుగానూ కనిపిస్తోంది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగానే ఉండగా, ఇటువంటి శిశువు ఇంతవరకు బతికి ఉండడం చాలా అరుదు అని వైద్యులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment