డి.హితీష్ (ఫైల్ ఫొటో)ఎ.లోకేష్ (ఫైల్ ఫొటో)ఇన్‌సెట్లో సిద్ధాంత్ పాత్రో మృతదేహం
సాక్షి, బరంపురం: హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. గోపాల్‌పూర్ సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం ఒడ్డుకు చేరుకోగా మిగిలిన ఇద్దరి కోసం గాలింపు ముమ్మరం చేశారు. పోలీసులు, బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. బినాయక్ ఆచార్య కళాశాల విద్యార్థి సంఘం కార్యదర్శి డి.హితీష్, ప్రెసిడెన్షియల్ కాలేజీకి చెందిన సిద్ధాంత్ పాత్రో, ఎ.లోకేష్‌లతో సహా వివిధ కళాశాలలకు చెందిన 19 మంది విద్యార్థులు శుక్రవారం హోలీ పండగ చేసుకున్నారు.
ఆ తర్వాత మధ్యాహ్నం గోపాల్‌పూర్ సముద్ర తీరానికి స్నానానికి వెళ్లారు. ఆ సమయంలో అలల ఉద్ధృతికి నలుగురు విద్యార్థులు కొట్టుకుపోగా ఒకరిని స్థానికులు రక్షించారు. మిగిలిన ముగ్గురు గల్లంతయ్యారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో సిద్ధంత్ పాత్రో మృతదేహం హరిపురం తీరంలో ఒడ్డుకు చేరింది. హితీష్, ఎ.లోకేష్‌ల జాడ దొరకలేదు. వీరిద్దరి కోసం మెరైన్, గోపాల్‌పూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment