
అదృశ్యమైన పదో తరగతి విద్యార్ధినులు
సాక్షి, తిరుపతి : నగరంలో విద్యార్థినుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఉదయం స్కూలుకు వెళుతున్నామని చెప్పి వెళ్లిన ముగ్గురు పదో తరగతి విద్యార్ధినులు అదృశ్యమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురానికి చెందిన గౌరీ, కడపకు చెందిన నాగమ్మ, కోర్లగుంటకు చెందిన సాయి ప్రియలు ఉదయం స్కూలుకు వెళుతున్నామని చెప్పి వెళ్లి కనిపించకుండా పోయారు.
వీరిలో ఇద్దరు ప్రభుత్వ బాలబాలికల సంరక్షణ గృహానికి చెందిన వారు కాగా మరొక అమ్మాయి ప్రైవేటు స్కూలుకు చెందిన విద్యార్ధిని. సంరక్షణ గృహం నుంచి వెళ్లిపోతున్నట్లు రాసిన ఓ లేఖను సంరక్షణ గృహ సిబ్బంది గుర్తించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కనపడకుండా పోయిన విద్యార్ధినుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment