కొరాపుట్(భువనేశ్వర్): తాను కొరాపుట్ నుంచి ఢిల్లీ వెళ్లిన వెంటనే ప్రతిపాదిత స్టేషన్లలో రైళ్లు ఆగుతాయన్న కేంద్ర రైల్వే, టెలికాం మంత్రి అశ్వినీ శ్రీవైష్టవ్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్, బస్తర్ జిల్లా బచేలిలో రైళ్లు ఆగాయి. ఉదయం ఆదేశాలు రావడంతో సాయంత్రం నుంచి ఆయా స్టేషన్లకు హాల్టులు కల్పించారు. మెదటి విడత కోవిడ్ సమయం నుంచి ఈ స్టేషన్లలో రైళ్లు ఆపడం నిలిపివేశారు. అనంతరం కోవిడ్ తగ్గుముఖం పట్టినా రైళ్లను పునరుద్ధరించలేదు.
దీంతో ఇటీవల రైల్వే మంత్రి కొరాపుట్ వచ్చినప్పుడు ఈ సమస్యను నాయకులు ప్రస్తావించారు. దీంతో ఆయా స్టేషన్లలో హాల్టులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు నెరవేర్చారు. దీంతో లక్ష్మీపూర్‌లో జగధల్‌పూర్–భువనేశ్వర్, జగధల్‌పూర్–హౌరా, జగధల్‌పూర్–రౌర్కెలా రైళ్లు ఆగనున్నాయి. అలాగే బచేలిలో విశాఖపట్నం–కిరండోల్ ఎక్స్‌ప్రెస్ రైలు (రాత్రిపూట రైలు) ఆగనుంది. ఈ ప్రకటనతో లక్ష్మీపూర్, నారాయణ పట్న, బందుగాం సమితులలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు వాల్తేర్ డీఆర్‌ఎం అనుఫ్ కమార్ సత్పతి లక్ష్మీపూర్ రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు.
చదవండి: ఎస్‌ఐ స్కాంలో అభ్యర్థి అరెస్టు... బ్లూటూత్ ద్వారా పరీక్ష రాసిన వైనం
Comments
Please login to add a commentAdd a comment