
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి సమితి కేంద్రం జొడియా వీధిలో గత కొద్ది రొజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఐదు ఇళ్లు కూలిపోయాయి. ఈ నేపథ్యంలో నిర్వాసిత బాధిత కుటుంబాలకు ఆవాస్ గృహాలను మంజూరు చేస్తున్నట్లు తహసీల్దార్ బిశ్వభూషిత్ సాహు వెల్లడించారు. తాత్కాలిక పునరావాసం కింది ఆయా కుటుంబాలకు ఇంటి పైకప్పు వేసుకునేందుకు టార్ఫాన్లను శుక్రవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ బొనొమాలి సాహు, ఏఆర్‌ఐ ఉమేష్ బిడిక పాల్గొన్నారు.
వాల్తేర్ డీఆర్‌ఎంతో ఎమ్మెల్యే భేటీ
పర్లాకిమిడి: తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని వాల్తేర్ డివిజనల్ మేనేజర్ సౌరభ్ ప్రసాద్‌ను పర్లాకిమిడి ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దుశ్శాలువతో సత్కరించారు. అనంతరం పర్లాకిమిడి రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం, స్టేషన్ పునరుద్ధరణ, కార్యాలయ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన డీఆర్‌ఎం.. సమస్యల పరిష్కారంతో పాటు పర్లాకిమిడి, గుణుపురం స్టేషన్లను త్వరలో పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఛిత్రి సింహాద్రి, గేదెల శ్రీధరనాయుడు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు యూనిఫాం పంపిణీ
రాయగడ: సదరు సమితి పరిధి పెంట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, సాక్సులను శుక్రవారం పంపిణీ చేశారు. జిల్లా బిజూ ఛత్ర జనతాదళ్ ఉపాధ్యక్షుడు ఉదయ్‌కుమార్ హిమిరిక, సర్పంచ్ ఎ.విశ్వనాథ, సమితి సభ్యులు జంబాక తదితరులు పాల్గొని, 530మంది విద్యార్థులకు వీటిని అందజేశారు. రాష్ట్రప్రభుత్వం విద్యార్థులకు ఏటా వీటిని ఉచితంగా పంపిణీ చేస్తోందని ప్రధానోపాధ్యయుడు మనోజ్‌కుమార్ గౌడొ తెలిపారు.

బాధిత కుటుంబాలకు టార్ఫాన్లు అందిస్తున్న అధికారులు

డీఆర్‌ఎంను సత్కరిస్తున్న ఎమ్మెల్యే నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment