● ఎంపీ చంద్రశేఖర్ సాహు
బరంపురం: గంజాం జిల్లాలో ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నామని బరంపురం ఎంపీ చంద్రశేఖర్ సాహు తెలియజేశారు. స్థానిక ఖాజా వీధిలో గంజాం ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ముస్లింలు ఉన్నతంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విక్రమ్ పండా, మేయర్ సంఘమిత్ర దొళాయి, ఛత్రపూర్ ఎమ్మెల్యే సుభాష్ చంద్ర బెహరా, జిల్లా ప్రణాళిక బోర్డు చైర్మన్ డా.రమేష్ చంద్ర చావ్ పట్నాయక్, ముస్లిం కమ్యూనిటీ అధ్యక్షుడు అబ్ధుల్ హాద్‌రిస్, ఉపాధ్యక్షుడు మహ్మద్ సలీం, కార్యదర్శి రహీం ఖాన్, యువజన అధ్యక్షుడు ఫైజర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
పట్టాలు తప్పిన ఓహెచ్‌సీ
రాయగడ: రైల్వే ట్రాక్‌లో విద్యుదీకరణ పనులకు వినియోగించే ఓహెచ్‌సీ (ఒవర్ హెడ్ కార్) భళ్లుమస్కా రైల్వేస్టేషన్‌కు సమీపంలో పట్టాలు తప్పింది. సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి అప్రమత్తమైన రైల్వే సంబంధిత శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులను చేపట్టారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం .
పేకాటరాయుళ్లు అరెస్టు
మల్కన్‌గిరి: జిల్లాలోని పోలీసులు ఆదివారం రాత్రి ఏఎస్‌ఐ భుజంగ కుమార్ జాన నేతృత్వంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మల్కన్‌గిరి సమితి ఎంవీ 84 మరియు 83 గ్రామాల్లో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే 84 గ్రామంలోని ఒక ఇంటిపై దాడిచేసి ఐదుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వీరిలో ఎంవీ 84 గ్రామానికి చెందిన అమాల్ దే, బాలాయి మండాల్, ఎంవీ 83 గ్రామానికి చెందిన అముల్యా సర్ద్‌ర్, సోమాల్ రౌయ్, పద్మాగిరికి చెందిన సోమాల్ అధికారి ఉన్నట్లు నిర్ధారించారు. వారి వద్ద నుంచి రూ.20,820 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మల్కన్‌గిరి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment