ప్రతీకాత్మక చిత్రం
భువనేశ్వర్: రక్త హీనతతో బాధపడుతున్న ఓ మహిళకు వేరే బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఒడిశాలోని రూర్కీలా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కుట్ర బ్లాక్‌లోని బుడకట గ్రామానికి చెందిన సరోజిని కాకు గురువారం మధ్యాహ్నం రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రి (ఆర్‌జిహెచ్)లో చేరింది. రోగి సికిల్ సెల్ అనీమియా అనే వ్యాధితో బాధపడుతోంది. దీంతో ఆమెకు రక్తం ఎక్కించాలని వైద్యులు తెలిపారు.
అయితే ఆమె బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ కాగా, B పాజిటివ్ రక్తం ఎక్కించారు. దీంతో ఆ మహిళ ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. మహిళకు వేరే గ్రూప్ రక్తం ఎక్కించారనీ, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కోసం మృతదేహాన్ని భద్రపరిచినట్లు తెలిపారు. విచారణకు కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
(చదవండి: ఎద్దు వయసు మూడున్నరేళ్లు.. విలువ రూ. కోటి!)
Comments
Please login to add a commentAdd a comment