సెల్‌ఫోన్లు, వాటి యజమానులతో ఎస్పీ సుశ్రీ
కొరాపుట్(భువనేశ్వర్): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన సెల్‌ఫోన్లు.. తిరిగి యజమానుల చేతికందాయి. వీటిని నవరంగపూర్ ఎస్పీ కార్యాలయంలో బాధితులకు అందించారు. నవరంగ్‌పూర్ జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎస్.సుశ్రీ సమక్షంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న, అపహరణకు గురైన సెల్‌ఫోన్లపై నిఘా పెట్టిన పోలీసులు..రూ.5 లక్షల విలువైన 49 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బాధితులకు సమాచారం అందించి, ఎస్పీ స్వయంగా సెల్‌ఫోన్లు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎస్‌ఎం ప్రధాన్, సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి: వామ్మో ఈ ఫైటింగ్ ఏంది..? కోర్టులోనే రెచ్చిపోయిన మహిళా లాయర్లు.. జుట్లు పట్టుకొని..
Comments
Please login to add a commentAdd a comment