భువనేశ్వర్: ఉద్యోగస్తులు బయట ఎలా ఉన్న ఆఫీసులోకి వెళ్లగానే హుందాగా ప్రవర్తించడంతో పాటు వారి పనిని నిబద్దతతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ సంస్థ తమ ఉద్యోగుల నుంచి ఆశిస్తుంది. అయితే కొందరు మాత్రం ఇవేవి తమకు పట్టవంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒరిస్సాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేంద్రాపడా జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఇంజినీర్లు తమ కార్యాలయంలో మద్యం సేవిస్తున్నట్లు వీడియో వైరల్ అయ్యింది.
దీంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ జెనా జలవనరుల శాఖను సోమవారం ఆదేశించారు. ఈ ఇరువురు నిందితులు మహానది నార్త్ డివిజన్‌లో ఇంజినీర్లుగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లాలోని నారాయణపూర్ సెక్షన్ కార్యాలయంలో ఇంజినీర్లు, మరికొందరు వ్యక్తులు పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో మద్యం, ఆహారం సరంజామాతో సమగ్ర వీడియో చిత్రీకరించి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇరువురు ఇంజినీర్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని జల వనరుల శాఖను ఆదేశిస్తూ సీఎస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి అన్యోన్యంగా ఉండేవాళ్లు,ఎలాంటి లోటు లేదు.. కానీ ఆ ఒక్క కారణంతో భార్యను హతమార్చాడు!
Comments
Please login to add a commentAdd a comment