![Married woman Was Smuggling Cannabis Was Arrested in Mohana - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/6/01.jpg.webp?itok=6dA0_1eW)
బాలికలను పాట్నాకు తీసుకు వెళ్తున్న జిల్లా యంత్రాంగం
పర్లాకిమిడి (ఒడిశా): పర్లాకిమిడి ఉప కారాగారంలో రిమాండ్‌లో ఉన్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఖైదీ పిల్లలను గజపతి జిల్లా అధికారులు వారి స్వగ్రామం పాట్నాకు బుధవారం తరలించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న పాట్నాకు చెందిన వివాహిత ఇటీవల మోహానా వద్ద పోలీసులకు పట్టుబడింది. ఆమెను అరెస్టు చేసి, పర్లాకిమిడి ఉప కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉంచారు.
ఆమెతో పాటే 5, 7 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు అమ్మాయిలను కూడా కారాగారానికే తరలించడంపై జిల్లా శిశు సంరక్షణ సమితి, జిల్లా లీగల్ సర్వీసెస్ అధ్యక్షులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనర్ బాలికలను జైలులో ఉంచకుండా వారి స్వగ్రామానికి తరలించాల్సిందిగా ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ లింగరాజ్ పండా, ఎస్పీ జయరాం శత్పథి సూచనల మేరకు పిల్లలిద్దరినీ పాట్నా తీసుకొని వెళ్తేందుకు డీసీపీయూ కార్యాలయానికి చెందిన నరేష్‌కుమార్ నాయక్, మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను వెంట పంపించారు. వారంతా పర్లాకిమిడి నుంచి పయనమై వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment