![Orissa: Strange Creature Found Lodi Ponga Forest - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/12/Untitled-7.jpg.webp?itok=K2Hi9BeN)
వింత జీవి
రాయగడ(భువనేశ్వర్): జిల్లాలోని మునిగుడ సమితి లోదిపొంగ అడవుల్లో అటవీశాఖ అధికారులకు ఓ వింతజీవి తారసపడింది. దీనిని చాకచక్యంలో పట్టుకుని అటవీశాఖ కేంద్రానికి తరలించారు. శనివారం రాత్రి కొంతమంది అటవీశాఖ సిబ్బంది అడవిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ జీవి కనిపించిందని అటవీశాఖ అధికారి ప్రసన్నకుమార్ మిశ్రొ తెలిపారు. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పేరుతో పిలుస్తారనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
అయితే ఇది విషపూరితమైన జీవమని, మనుషులపై దాడి చేసి, కాటు వేస్తుందని వన్యప్రాణుల సంరక్షణ విభాగానికి చెందిన తెలిపారు. దాడి చేసే స మయంలో శరీరంలోకి విషం ఎక్కి, ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని సమాచారం. దీనిపై వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment