Electric Vehicle Subsidy In Odisha:ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీలు) కొనుగోళ్లపై 15% డిస్కౌంట్ అందించనున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఒడిశా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2021 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ద్విచక్ర వాహనాలకు వాహనం ఎక్స్ షో రూమ్ ధర మీద 15% లేదా రూ.5,000 వరకు, త్రిచక్ర వాహనాలకు రూ.10,000, నాలుగు చక్రాల వాహనాలకు రూ.50,000 వరకు సబ్సిడీలు ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఆర్డీవో కార్యాలయాల ద్వారా వాహనాలు రిజిస్టర్ చేసుకున్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో సబ్సిడీ మొత్తం క్రెడిట్ చేయనున్నట్లు తెలిపింది. ఈ పథకం డిసెంబర్ 31, 2025 వరకు అమలులో ఉండనున్నట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు, కొనుగోలు ప్రోత్సాహకాల క్రెడిట్, ఈవీ కొనుగోళ్ల రుణ సబ్సిడీలకు సంబంధించిన సమాచారాన్ని ట్రాక్ చేయడానికి ఎన్ఐసి లేదా ఒసీఏసీ సహాయంతో రవాణా కమిషనర్ ఒక ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇంతకు ముందు, వాణిజ్య & రవాణా శాఖ అన్ని కేటగిరీల ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజులు, మోటారు వాహన పన్నులపై అక్టోబర్ 29, 2021 నుంచి మినహాయింపు ఇచ్చింది.
(చదవండి: ఫేస్‌బుక్‌పై విజిల్ బ్లోయర్ ఫ్రాన్సెస్ హౌగెన్ సంచలన ఆరోపణలు..!)
Comments
Please login to add a commentAdd a comment