ఒడిశాలో కనీవినీ ఎరుగని రీతిలో రైలు ప్రమాదం జరిగిన సమయంలో నేటి తరం యువత తమలో మానవత్వం ఉందని నిరూపించారు. క్షతగాత్రులతో కిక్కిరిసిపోయిన బాలసోర్ ప్రభుత్వ ఆస్పత్రికి యువతీ యువకులు క్యూ కట్టారు. బాధితులకి అవసరమైన రక్తం తాము ఇస్తామంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఒక జిల్లా ఆస్పత్రికి ఒకేసారి 250 మందికి పైగా క్షతగాత్రులు రావడంతో వారికి చికిత్స ఎలా అందించాలో తెలీక సిబ్బంది తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
అప్పటికే రైలు ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానిక యువత ఆస్పత్రికి వచ్చి తమ వంతు ఏదైనా చేస్తామన్నారు. ఈ విషయాన్ని జిల్లా అదనపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మృత్యుంజయ్ మిశ్రా చెప్పారు. ‘‘నేను గత కొన్ని దశాబ్దాలుగా ఈ వృత్తిలో ఉన్నాను. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఒకేసారి వందల మంది క్షతగాత్రులకి చికిత్స అందించడం చాలా కష్టంగా మారింది. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి రక్తదానం చేయడానికి రావడం సంభ్రమాశ్చర్యాల్ని కలిగించింది. రాత్రంతా 500 యూనిట్ల రక్తాన్ని సేకరించాం. రక్తం ఇచ్చిన యువతకి ధన్యవాదాలు ’’ అని డాక్టర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment