తరగతి గదిలో లభించిన నాటు పిస్తోలు
భువనేశ్వర్: సంబల్‌పూర్ జిల్లా, జొమొనొకిరా సమితి, రెంగుముండా ప్రాథమికోన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలో నాటు పిస్తోలు లభించడం చర్చనీయాంశమైంది. సోమవారం ఉదయం తరగతి గది శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్యకర్తలకు అక్కడి పిస్తోలు కనిపించింది. వీరు ఈ విషయం ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీకాంత్ బాగ్ దృష్టికి తీసుకువెళ్లారు. నిన్నమొన్నటి వరకు ఈ పిస్తోలు లభించిన తరగతి గది సహాయ ఉపాధ్యాయుడు గోవిందు భొయి ఆధీనంలో ఉండేది.
ఇక్కడి నుంచి బదిలీ అయ్యేంత వరకు పాఠశాలలో రెండు తరగతి గదులను ఆయన తన ఆధీనంలోనే ఉంచుకుని, వినియోగించారు. తనకు వేరే చోటుకు బదిలీ అయిన తర్వాత ఆ గది తాళాలు అప్పగించకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాళాలు తెరిచి, గది శుభ్రం చేస్తుండగా ఈ పిస్తోలు తారసపడినట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. (చదవండి: పెద్దాయన పబ్లిసిటి పిచ్చి.. తిక్క కుదిర్చిన కన్సుమర్ కోర్టు )
Comments
Please login to add a commentAdd a comment