కొరాపుట్: శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఆధునిక యుగంలో అన్ని వసతులు సమకూర్చుకుంటున్నాం అని సంబర పడుతున్నాం. కానీ ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ ప్రజలు కనీస వసతులకు నోచుకోవడం లేదు. పురిటి నొప్పులు వస్తే పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. వసతులు లేకపోవడంతో ఆస్పత్రికి రాకుండానే ప్రసవిస్తున్న ప్రాణాలెన్నో.
నబరంగ్‌పూర్ జిల్లాలోని జొరిగాం సమితి చక్ల పొదర్ గ్రామ పంచాయతీ పరిధి దహిమార గ్రామానికి చెందిన ఉషావతి బోత్ర అనే గర్భిణికి బుధవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గ్రామస్తులు ఆశ కార్యకర్త నళినిని సంప్రదించారు. ఆమె వెంటనే జొరిగాం ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కానీ వెంటనే అంబులెన్స్ వచ్చినప్పటికీ గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న నది అడ్డంగా మారింది. వెంటనే గ్రామస్తులు ఉషావతిని ఒక మంచంపై మోసుకొని నది ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇదే సమయంలో వారికి అంబులెన్స్ సిబ్బంది సైతం సాయం చేశారు. అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఉషావతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు.
చదవండి: థాక్రే అంటే ఇప్పటికీ గౌరవమే.. శివసేనకు వెన్నుపోటు పొడిచి మొత్తం ఆయనే చేశారు!: రెబల్స్
Comments
Please login to add a commentAdd a comment