ఖమ్మం: వేసవి కాలం వచ్చేసింది. నానాటికీ ఉక్కపోత పెరుగుతోంది. ఇళ్లలో అయితే ఎలాగోలా ఇక్కట్లు అధిగమిస్తాం. కానీ ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మాతాశిశు కేంద్రం(ఎంసీహెచ్)లోని బాలింతల ఇబ్బందులు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఎంసీహెచ్ రెండో అంతస్తులో ఉండగా.. వేడి ఎక్కువగా, ఫ్యాన్లు తక్కువగా ఉండడంతో బాలింతలు ఉక్కపోతతో అవస్థ పడుతున్నారు. దీంతో గర్భిణులను ప్రసవానికి తీసుకొచ్చేటప్పుడు వారి కుటుంబ సభ్యులు టేబుల్ ఫ్యాన్ కూడా వెంట తీసుకొస్తున్నారు. ఫలితంగా ప్రతీ బాలింత బెడ్ వద్ద టేబుల్ ఫ్యాన్లు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment