చనిపోయిన బిడ్డను ఇచ్చారంటూ ఆందోళన.. | people protest at hospital | Sakshi
Sakshi News home page

చనిపోయిన బిడ్డను ఇచ్చారంటూ ఆందోళన..

Published Wed, Jun 13 2018 3:09 PM | Last Updated on Wed, Jun 13 2018 3:09 PM

people protest at hospital - Sakshi

మరణించిన ఆడశిశువుబిడ్డ తల్లి కవిత కుంబారి, కవిత కుటుంబ సభ్యులకు రికార్డు చూపిస్తున్న డాక్టర్లు  

రాయగడ: రాయగడ జిల్లా ఆస్పత్రిలో శిశువు మారిపోయిందన్న అభియోగంతో వివాదం రేగింది. స్థానిక ఆస్పత్రిలో మంగళవారం ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు వైద్యాధికారుల రికార్డుల్లో ఉంది. కానీ మహిళ కుటుంబ సభ్యులు ప్రసవ సమయంలో మగ బిడ్డను చూశామంటూ ఆందోళనకు దిగారు.

వివరాలిలా ఉన్నాయి. రాయగడ జిల్లా కాశీపూర్‌ సమితి కుంబారసిల్లా గ్రామానికి చెందిన కవిత కుంబారి ప్రసవ వేదనతో రాయగడ జిల్లా ఆస్పత్రిలో ఈ నెల 10వ తేదీన అడ్మిట్‌ కాగా సోమవారం రాత్రి 11గంటల సమయంలో శిశువుకు జన్మనిచ్చింది.

శిశువు బరువు తక్కువగా ఉండడంతో ఎస్‌ఎంసీఎస్‌లో ఉంచి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. కవిత కుంబారికి సీరియస్‌ కావడంతో కొరాపుట్‌ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మంగళవారం కవిత కుటుంబ సభ్యులను డాక్టర్లు పిలిచి కవితకు పుట్టిన ఆడ శిశువు మృతిచెందిందని చెప్పారు.

దీంతో కుటుంబ సభ్యులు ప్రసవ సమయంలో మగ బిడ్డను చూశామని, శిశువు మృతిచెందిందని డాక్టర్లు ఆడ బిడ్డను అప్పగిస్తున్నారని ఆందోళనకు దిగారు. డాక్టర్లు శిశువును మార్చేశారని ఆరోపిస్తున్నారు. కానీ కవిత ఆడ శిశువుకు జన్మనిచ్చిందని రికార్డుల్లో రాసి ఉంది. ఈ సమస్య పట్ల వైద్య విభాగం, ఉన్నతాధికారులు విచారణ సాగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement