parents protest
-
కరీంనగర్ జిల్లా వేగురుపల్లి ప్రభుత్వ స్కూలు ముందు తల్లిదండ్రుల ధర్నా
-
నిలోఫర్‌లో బాలుడి మృతి.. తల్లిదండ్రుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : నగరంలో నిలోఫర్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు మృతి చెందడం ఆందోళనకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే దూల్‌పేట్‌కు చెందిన వీర్ సింగ్‌కు డెంగీ జ్వరం రావడంతో అతని తల్లిదండ్రులు నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. మూడు రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు మంగళవారం మృతి చెందాడు. అయితే బాలుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. -
మా కూతురును అమ్మేయాలని చూస్తున్నారు
పంజగుట్ట : ఇంజినీరింగ్ చదివిన తన కూతురును ప్రేమ పేరుతో ట్రాప్ చేసి అమ్మేయడానికి యత్నిస్తున్నారంటూ సదరు యువతి కుటుంబ సభ్యులు, పలు సంఘాల నాయకులు శనివారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన మహేష్ పెద్ద కుమార్తె ఇందిర (22) కరీంనగర్లో ఇంజినీరింగ్ పూర్తిచేసింది. కంప్యూటర్ కోర్సు చదువు కోసం ఏడాది క్రితం నగరానికి వచ్చింది. కూకట్‌పల్లిలోని ఓ హాస్టల్లో ఉంటూ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌లో చేరింది. ఈ క్రమంలో ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గత శనివారం తన సోదరికి ఇందిర ఫోన్ చేసి తాను మతం మారానని, అదే వర్గానికి చెందిన యువకుడిని వివాహం చేసుకున్నానని చెప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వారు ఆదివారం ఆమె ఉండే హాస్టల్‌కు వెళ్లి చూడగా ఇందిర జాడ కనిపించలేదు. దీంతో ఆమెకు ఫోన్ చేయగా.. తాను పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఉన్నానని చెప్పడంతో వారు అక్కడికి వెళ్లారు. వివాహం చేసుకున్న అబ్బాయిని, అతని కుటుంబ సభ్యులను పిలిపించండి మాట్లాడదామన్నారు. అతడికి ఎవరూ లేరని అన్నీ తనతోనే మాట్లాడండని, యువతి మేజర్ అని ఎస్సై దురుసుగా మాట్లాడా రని వారు ఆరోపించారు. ఎస్సై ఒక వర్గానికే మద్దతు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నాన్నను చూడాలంటూ తమ కూతురు ఫోన్లో మెసేజ్ పెట్టిందని వారు తెలిపారు. తొమ్మిది నెలల క్రితమే తమ కూతురు మతం మారినట్లు చూపిస్తున్నారని కానీ రెండు నెలల క్రితం తమతో తిరుపతికి వచ్చిందని, నెలరోజుల క్రితం సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా హాజరైందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఫేక్ సర్టిఫికెట్లు చూపించి తమ కూతురిని విదేశాల్లో విక్రయించేందుకు చూస్తున్నారని వారు ఆరోపించారు. ఈ క్రమంలో వీరికి మద్దతుగా ఓ వర్గం ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి నిరసనవ్యక్తం చేశారు. ఒక వర్గానికే వత్తాసు పలుకుతున్న ఎస్సైపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏసీపీ కార్యాలయం ఎదుట పలు సంఘాల నాయకుల నిరసన ఆరోపణలు అవాస్తవం: ఏసీపీ తిరుపతన్న లక్సెట్టిపేటకు చెందిన ఇందిర అలియాస్ జుబేరా టెక్ మహేంద్రాలో విధులు నిర్వహిస్తోందని, కరీంనగర్‌కు చెందిన రిజ్వాన్ గచ్చిబౌలిలో జెన్‌ప్యాక్‌లో విధులు నిర్వహిస్తున్నాడని పంజగుట్ట ఎసీపీ తిరుపతన్న తెలిపారు. తమ వివాహం పెద్దలకు ఇష్టం లేదంటూ, రక్షణ కల్పించాలంటూ గత నెల 26న పంజగుట్ట పోలీసులను ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు. ఒక వర్గానికి ఎస్సై మద్దతు పలుకుతున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇందిర, రిజ్వాన్ కరీంనగర్లో ఇంజినీరింగ్ చదువుకున్నారని, అప్పుడే వారికి పరిచయం ఉందన్నారు. 2018 జులైలోనే వీరు వివాహం చేసుకున్నారని, అప్పటికే అమ్మాయి మతం మారిందని తిరుపతన్న చెప్పారు. అనుమానాలున్నట్లు ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని ఆయన స్పష్టంచేశారు. -
డాక్టర్ల నిర్లక్షమే కారణం.. తల్లిదండ్రులు ఆందోళన
-
పుస్తెలు తాకట్టుపెట్టి ఫీజులు కట్టినం
హుస్నాబాద్‌రూరల్ మెదక్ : పిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించాలని పుస్తెలు తాడు తాకట్టుపెట్టి హుస్నాబాద్ ఎస్ఆర్ ప్రైవేట్ పాఠశాలలో చేర్పించి రూ. 30వేల ఫీజు కట్టిన.. మా పిల్లలకు నూకల బువ్వ, నీళ్ల చారు, పురుగులు పడ్డ దొడ్డు బియ్యం కూడు పెడతారా..? అని అంకుషాపూర్‌కు చెందిన రేణుక పాఠశాల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ఎండకాలంలో టీచరమ్మలు మా తండాకు వచ్చి మంచి చదువులు చెప్తం.. హాస్టల్లో ఉంచుతాం అని మాయ మాటలు చెప్తే పిల్లగాడిని హాస్టల్లో చేర్చిన.. ఇప్పుడు రాత్రి పూట పురుగులు పడ్డ బువ్వ తినకపోతే సార్లు కట్టెలతో కొడుతున్నరని మా కొడుకు ఏడువబట్టేనని పాఠశాల రేణుక కన్నీరు పెట్టుకుంది. హుస్నాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్పి ఒక్కో విద్యార్థి నుంచి రూ. 30వేల ఫీజు వసూలు చేసింది. గిరిజన పిల్లల వద్ద ఫీజులు తీసుకున్న యాజమాన్యం విద్యార్థులకు చదువులు చెప్పకపోగా, పురుగులు పడిన నూకల బువ్వ, నీళ్ల చారు పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు వడ్డించే భోజనం, పురుగులు పట్టిన బియ్యం బయట వేసి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. మా ఫీజులు తిరిగిచ్చి మా పిల్లలను మాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో హుస్నాబాద్, కోహెడ ఎస్సైలు సుధాకర్, సతీష్‌లు అక్కడకు చేరుకొని ఆందోళన చేస్తున్న పిల్లల తల్లిదండ్రుల సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల యాజమాన్యం సమక్షంలోనే విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని పరిశీలించారు. పిల్లలకు ఇలాంటి ఆహారం ఇవ్వడం భావ్యం కాదని మందలించారు. పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పాఠశాలపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. దీంతో ఆందోళనకారులు కేసులు కాకుండా మా ఫీజులు మాకు ఇచ్చి మా పిల్లలను అప్పగించి న్యాయం చేయాలని వేడుకున్నారు. మా అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఇంగ్లిష్ చదువుల పేరుతో పిల్లలను చేర్చుకున్నట్లు గిరిజనులు, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూకల బువ్వ తినకపోతే కొడుతరు పురుగులు పడ్డ నూకల బువ్వ తినకపోతే సార్లు కర్రతో కొడుతరు. నీళ్ల చారు పెడుతరు. హాస్టలు విషయాలు ఇంటికాడ చెప్పితే కొడుతమని బెదిరిస్తున్నారు. మా ఫ్రెండ్‌ను కర్రతో కొడుతే చేతులకు వాతలు వచ్చినై. మాకు బోరు నీళ్లు ఇస్తరు.. సార్లు క్యాన్ నీళ్లు తాగుతరు. – శరత్‌కుమార్, 4వ తరగతి -
నారాయణ కళాశాల మూసివేత
మదనపల్లె: పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తామంటూ ఇల్లిల్లూ తిరిగి, బతిమాలి కళాశాలలో చేర్పించుకున్న నారాయణ కళాశాల యాజమాన్యం ముందస్తు సమాచారం లేకుండా అర్ధాంతరంగా కళాశాలను మూసివేసింది. శుక్రవారం కళాశాలకు బయలుదేరిన పిల్లలు ఈ విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కళాశాల ఎదుట ధర్నా చేశారు. వారి గోడు వినేవారు, సమాధానం చెప్పేవారు లేకపోవడంతో విలేకరులను ఆశ్రయించారు. స్థానిక ఎస్బీఐ కాలనీలో నారాయణ స్కూల్ యాజమాన్యం 1 నుంచి 10 వరకు పాఠశాల, ఇంటర్మీడియట్ కళాశాల నడుపుతోంది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూపులో సుమారు 90 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. 2018–19లో ప్రవేశాల కోసం పదో తరగతి పరీక్షలు ప్రారంభంకాక ముందు నుంచి అధ్యాపకులు పట్టణంలో ఇంటింటికీ తిరిగి పిల్లలను చేర్పించారు. కళాశాల ప్రారంభమై నెల రోజులకు పైగానే నడిచింది. విద్యార్థుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడం, లెక్చరర్లు పనిచేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఉన్నట్టుండి కళాశాలను యాజమాన్యం మూసివేసింది. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నిస్తే.. తిరుపతిలోని తమ బ్రాంచీల్లో ఎక్కడైనా ఇదే అడ్మిషన్ నంబర్‌పై చేర్చుకుంటామని, కాకపోతే ఫీజు ఎక్కువగా ఉంటుందని, హాస్టల్ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కట్టిన ఫీజుల్లో అడ్మిషన్ ఫీజు మినహాయించుకుని తిరిగి ఇచ్చేందుకు సిద్ధమని చెబుతోంది. కానీ ముందస్తు సమాచారం లేకుండా కళాశాల మూసివేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్నా వారికి సమాధానం చెప్పేందుకు, పరిస్థి తి వివరించేందుకు కళాశాల యాజమాన్యం ఎవ రూ లేకపోవడం గమనార్హం. సిబ్బంది ఎవరైనా వస్తారేమోనని ఆశగా ఎదురుచూసి ఉసూరుమంటూ వెళ్లిపోయారు. -
డబ్బులిస్తేనే మృతదేహాన్నిస్తామన్న తల్లిదండ్రులు
సిద్దిపేటటౌన్: కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ తుది శ్వాస విడిచిన సావిలి మీనా మృతదేహాన్ని ఎవరూ తీసుకువెళ్లాలనే విషయంలో ఆస్పత్రి వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను గొంతు నులిమిన ఘటనలో గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శుక్రవారం ఉదయం మీనా మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన తర్వాత ఇరు కుటుంబాల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని తాము తీసుకువెళ్తామంటే తాము తీసుకువెళ్తామంటూ వాదనకు దిగారు. వీరిని సముదాయించేందుకు బంధువులు చాలా ప్రయత్నించాల్సి వచ్చింది. మీనా తల్లిదండ్రులు హన్మంతరావుతో పెళ్లి అయిన నాటి నుంచి ఏ అవసరం ఉన్నా తామే చూసుకున్నామని, మధ్యలో డబ్బు కావాలంటే కూడా ఇచ్చామని, ఆ డబ్బు తిరిగి ఇస్తేనే మృతదేహాన్ని అత్తింటికి తీసుకువెళ్లనిస్తామని తేల్చిచెప్పారు. అయితే మధ్యవర్తులు నచ్చజెప్పడంతో హన్మంతరావు తరపువాళ్లు కొంత వెనక్కి తగ్గి కార్యక్రమాలు అయిన తర్వాత ఇరు వర్గాల వాళ్లు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని చెప్పడంతో వివాదం కొంత సద్దుమణిగింది. ఆ తర్వాత మరి కొంత సేపటికి తమ బిడ్డను చంపిన వారి ఇంటికి తీసుకువెళ్లనివ్వమని, తమ బిడ్డ చివరి కార్యక్రమాన్ని తామే నిర్వహిస్తామని చెప్పి మృతదేహాన్ని తల్లి గారి ఊరు అయిన గాడిచర్లపల్లికి తీసుకువెళ్లారు. మార్చురీలో నుంచి మీనా మృతదేహాన్ని తీసుకువస్తున్న క్రమంలో తల్లిదండ్రులు బోరున విలపించారు. దీంతో అక్కడి వాతావరణం శోకసంద్రంలో మునిగిపోయింది. -
చనిపోయిన బిడ్డను ఇచ్చారంటూ ఆందోళన..
రాయగడ: రాయగడ జిల్లా ఆస్పత్రిలో శిశువు మారిపోయిందన్న అభియోగంతో వివాదం రేగింది. స్థానిక ఆస్పత్రిలో మంగళవారం ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు వైద్యాధికారుల రికార్డుల్లో ఉంది. కానీ మహిళ కుటుంబ సభ్యులు ప్రసవ సమయంలో మగ బిడ్డను చూశామంటూ ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. రాయగడ జిల్లా కాశీపూర్ సమితి కుంబారసిల్లా గ్రామానికి చెందిన కవిత కుంబారి ప్రసవ వేదనతో రాయగడ జిల్లా ఆస్పత్రిలో ఈ నెల 10వ తేదీన అడ్మిట్ కాగా సోమవారం రాత్రి 11గంటల సమయంలో శిశువుకు జన్మనిచ్చింది. శిశువు బరువు తక్కువగా ఉండడంతో ఎస్ఎంసీఎస్లో ఉంచి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. కవిత కుంబారికి సీరియస్ కావడంతో కొరాపుట్ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మంగళవారం కవిత కుటుంబ సభ్యులను డాక్టర్లు పిలిచి కవితకు పుట్టిన ఆడ శిశువు మృతిచెందిందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ప్రసవ సమయంలో మగ బిడ్డను చూశామని, శిశువు మృతిచెందిందని డాక్టర్లు ఆడ బిడ్డను అప్పగిస్తున్నారని ఆందోళనకు దిగారు. డాక్టర్లు శిశువును మార్చేశారని ఆరోపిస్తున్నారు. కానీ కవిత ఆడ శిశువుకు జన్మనిచ్చిందని రికార్డుల్లో రాసి ఉంది. ఈ సమస్య పట్ల వైద్య విభాగం, ఉన్నతాధికారులు విచారణ సాగిస్తున్నారు. -
మా బాబు ఆచూకీ ఎక్కడ ?
యాదగిరిగుట్ట(ఆలేరు) : తమ కొడుకు కిడ్నాప్‌కు గురై సంవత్సరమైనా పోలీసులు ఇప్పటి వరకు ఆచూకీ కనిపెట్టలేక పోవడం బాధాకరమని, వెం టనే తన కొడుకు ఆచూకీ తెలపాలని అరుణ్ కుటుంబ సభ్యులు బుధవారం యాదగిరిగుట్టలో వివిధ పార్టీల నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక సీఐ అశోక్‌కుమార్, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ యువజన విభా గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వకొలను సతీష్ రాజ్, యాదాద్రి దేవస్థానం మాజీ ధర్మకర్త పెలి మెల్లి శ్రీధర్‌గౌడ్, డీసీసీ వైస్ ప్రసిడెంట్ కలకుంట్ల బాల్‌నర్సయ్యగౌడ్ పాల్గొని మాట్లాడుతూ అరుణ్ ఎక్కడ ఉన్నాడనే విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వకపోడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలుగుతుందన్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఇంకా బాలుడి కిడ్నాప్‌ను గుర్తిం చకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అరుణ్ తండ్రి న్యాలపట్ల అశోక్, తల్లి నిర్మల మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీస్ అధికారులు ఎలాగైన తమ కొడుకు ఆచూకీ తెలపాలన్నారు. ప్రభుత్వం, పోలీసు అధికారులు శ్రీమంతులకు ఒక న్యాయం.. నిరుపేదలకు మరో న్యాయం చేస్తున్నట్లు స్పష్టమవుతుం దని ఆవేదన చెందారు. ర్యాలీలో ఆయా పార్టీ నాయకులు గడ్డం చంద్రంగౌడ్, బబ్బూరి శ్రీధర్‌గౌడ్, గుండు సాయిలుగౌడ్, గుండ్లపల్లి నర్సింహగౌడ్, మన్సూర్ పాషా, రాజుగౌడ్, ముఖ్యర్ల భిక్షపతియాదవ్, నర్సింహగౌడ్ తదితరులు ఉన్నారు. -
‘బచ్పన్’ ఎదుట ఆందోళన
హైదరాబాద్: తమ చిన్నారిని స్కూల్ నిర్వాహకులు కొట్టారని ఆరోపిస్తూ చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. నగరంలోని అల్వాల్ బచ్పన్ ప్లే స్కూల్లో నర్సరీ చదువుతున్న ఆరుషీ రెడ్డిని స్కూల్ లో దండించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. బచ్పన్ యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో వారు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఆ టీచర్‌ను చూస్తే భయమేసి స్కూల్ కి వెళ్లలేదు
హైదరాబాద్ : 'ఆ టీచర్‌ను చూస్తే భయమేస్తోంది...అందుకే ఈరోజు స్కూల్ కు వెళ్లలేదు. ముందు స్కేల్ పెట్టి కొట్టింది. అది విరిగి పోవటంతో మళ్లీ పెన్ను పెట్టి గీరింది' అని తెలుగు మాట్లాడినందుకు డాన్ బాస్కో స్కూల్ ఉపాధ్యాయురాలి చేతిలో దెబ్బలు తిన్న ఓ విద్యార్థి మాటలు. పాఠశాలలో తెలుగు మాట్లాడిన పాపానికి ఎర్రగడ్డ డాన్‌బాస్కో స్కూల్లో ఉపాధ్యాయురాలు తనూజ స్కేల్‌తో విద్యార్థులను చితకబాదిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు బుధవారం విచారణ జరుపుతున్నారు. విద్యాశాఖ అధికారులు ఈరోజు ఉదయం డాన్ బాస్కో స్కూల్‌కు వెళ్లి విచారిస్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. మరోవైపు ఈ సంఘటనను బాలల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. తెలుగువారు తెలుగుమాట్లాడం జన్మహక్కని, ఉపాధ్యాయురాలి తీరును ఖండిస్తున్నామని బాలల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు తెలిపారు. ఈ సంఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సుమోటోగా కేసు విచారణను చేపట్టింది. జూలై 21వ తేదీలోగా సంఘటనపై పూర్తి నివేదిక అందించాలని అధికారులతో పాటు పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.