సాక్షి, హైదరాబాద్ : నగరంలో నిలోఫర్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు మృతి చెందడం ఆందోళనకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే దూల్‌పేట్‌కు చెందిన వీర్ సింగ్‌కు డెంగీ జ్వరం రావడంతో అతని తల్లిదండ్రులు నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. మూడు రోజుల నుంచి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలుడు మంగళవారం మృతి చెందాడు. అయితే బాలుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment