అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న అరుణ్ కుటుంబ సభ్యులు, నాయకులు
యాదగిరిగుట్ట(ఆలేరు) : తమ కొడుకు కిడ్నాప్‌కు గురై సంవత్సరమైనా పోలీసులు ఇప్పటి వరకు ఆచూకీ కనిపెట్టలేక పోవడం బాధాకరమని, వెం టనే తన కొడుకు ఆచూకీ తెలపాలని అరుణ్ కుటుంబ సభ్యులు బుధవారం యాదగిరిగుట్టలో వివిధ పార్టీల నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక సీఐ అశోక్‌కుమార్, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ యువజన విభా గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వకొలను సతీష్ రాజ్, యాదాద్రి దేవస్థానం మాజీ ధర్మకర్త పెలి మెల్లి శ్రీధర్‌గౌడ్, డీసీసీ వైస్ ప్రసిడెంట్ కలకుంట్ల బాల్‌నర్సయ్యగౌడ్ పాల్గొని మాట్లాడుతూ అరుణ్ ఎక్కడ ఉన్నాడనే విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వకపోడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలుగుతుందన్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఇంకా బాలుడి కిడ్నాప్‌ను గుర్తిం చకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
అరుణ్ తండ్రి న్యాలపట్ల అశోక్, తల్లి నిర్మల మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీస్ అధికారులు ఎలాగైన తమ కొడుకు ఆచూకీ తెలపాలన్నారు. ప్రభుత్వం, పోలీసు అధికారులు శ్రీమంతులకు ఒక న్యాయం.. నిరుపేదలకు మరో న్యాయం చేస్తున్నట్లు స్పష్టమవుతుం దని ఆవేదన చెందారు.
ర్యాలీలో ఆయా పార్టీ నాయకులు గడ్డం చంద్రంగౌడ్, బబ్బూరి శ్రీధర్‌గౌడ్, గుండు సాయిలుగౌడ్, గుండ్లపల్లి నర్సింహగౌడ్, మన్సూర్ పాషా, రాజుగౌడ్, ముఖ్యర్ల భిక్షపతియాదవ్, నర్సింహగౌడ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment