భువనేశ్వర్: నగరంలోని ప్రఖ్యాత ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ) డైరెక్టర్‌గా ప్రొఫెసర్ ఆశిష్ ఘోష్ నియమితులయ్యారు. రాష్ట్ర గవర్నర్, ఛాన్సలర్ ప్రొఫెసర్ గణేషీలాల్ నిర్ణయం మేరకు ఈ నియామకం జరిగింది. ఈ పదవిలో ఘోష్ ఐదేళ్ల పాటు నిరవధికంగా కొనసాగుతారు. బాధ్యతలు స్వీకరించిన నుంచి కాల పరిమితి పరిగణిస్తారు. ఇప్పటి వరకు ఆయన కోల్‌కతా ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ప్రొఫెసర్, ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. బోధన రంగంలో సుదీర్ఘంగా 28 ఏళ్ల అనుభవం కలిగి ఉండటంతో పాటు వివిధ అంశాలపై 10 పుస్తకాలను వెలువరించారు. 10మంది ిపీహెచ్‌డీ అభ్యర్థులకు విజయవంతంగా మార్గనిర్దేశం చేశారు.

ప్రొఫెసర్ ఆశిష్ ఘోష్
Comments
Please login to add a commentAdd a comment