ఘటనకు కారణమైన లారీ వద్ద గుమిగూడిన స్థానికులు
మల్కన్‌గిరి( భువనేశ్వర్): జిల్లా కేంద్రానికి సమీపంలోని పండ్రీపణి గ్రామం బుధవారం రాత్రి ఓ మృత్యువాహనం దూసుకెళ్లింది. బియ్యం బస్తాలతో వస్తున్న లారీ గ్రామ సర్పంచ్ శివఖేముండు కుమారుడి వివాహ ఊరేగింపు పైకి దూసుకు వచ్చింది. ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శివఖేముండు తన కుమరుడి వివాహం భయపరగూడలో జరిపించి, స్వగ్రామనికి ఊరేగింపుగా తీసుకు వస్తున్నారు.
అదే సమయంలో మల్కన్‌గిరి వైపు వస్తున్న ప్రభుత్వ బియ్యం సరఫరా చేసే లారీకి బ్రేకులు విఫలమయ్యాయి. దీంతో ముందుగా ఓ బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం పెళ్లి ఉరేగింపు బృందంపైకి దూసుకు వచ్చింది. ప్రమాదంలో శివఖేముండు, పెళ్లి కుమారుడి మేనమామ సంతోష్‌కుమార్ సాహు, సునబేడకు చెందిన డప్పు వాయిధ్యకారులు రాజకుమార్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురు గాయాలపాలు కాగా మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న మల్కన్‌గిరి ఐఐసీ రామప్రసాద్ నాగ్ అక్కడికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే పండ్రీపణి గ్రామస్తులు లారీను అడ్డుకొన్నారు. మల్కన్‌గిరి–జయపురం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసి, టైర్లు కాలుస్తూ నిరసన వ్యక్తం చేశారు.
చదవండి: గిటారులో డ్రగ్స్.. అంతా బాగానే కవర్ చేశాడు.. కానీ..
Comments
Please login to add a commentAdd a comment