wedding band
-
పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ.. ఒక్కసారిగా ఆనందం ఆవిరైంది
మల్కన్‌గిరి( భువనేశ్వర్): జిల్లా కేంద్రానికి సమీపంలోని పండ్రీపణి గ్రామం బుధవారం రాత్రి ఓ మృత్యువాహనం దూసుకెళ్లింది. బియ్యం బస్తాలతో వస్తున్న లారీ గ్రామ సర్పంచ్ శివఖేముండు కుమారుడి వివాహ ఊరేగింపు పైకి దూసుకు వచ్చింది. ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శివఖేముండు తన కుమరుడి వివాహం భయపరగూడలో జరిపించి, స్వగ్రామనికి ఊరేగింపుగా తీసుకు వస్తున్నారు. అదే సమయంలో మల్కన్‌గిరి వైపు వస్తున్న ప్రభుత్వ బియ్యం సరఫరా చేసే లారీకి బ్రేకులు విఫలమయ్యాయి. దీంతో ముందుగా ఓ బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం పెళ్లి ఉరేగింపు బృందంపైకి దూసుకు వచ్చింది. ప్రమాదంలో శివఖేముండు, పెళ్లి కుమారుడి మేనమామ సంతోష్‌కుమార్ సాహు, సునబేడకు చెందిన డప్పు వాయిధ్యకారులు రాజకుమార్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురు గాయాలపాలు కాగా మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మల్కన్‌గిరి ఐఐసీ రామప్రసాద్ నాగ్ అక్కడికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే పండ్రీపణి గ్రామస్తులు లారీను అడ్డుకొన్నారు. మల్కన్‌గిరి–జయపురం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసి, టైర్లు కాలుస్తూ నిరసన వ్యక్తం చేశారు. చదవండి: గిటారులో డ్రగ్స్.. అంతా బాగానే కవర్ చేశాడు.. కానీ.. -
పెళ్లి బృందానికి విషాదం
ప్రకాశం జిల్లాలో నేడు వివాహం విజయవాడ నుంచి బయలుదేరిన కాసేపటికే ప్రమాదం పెళ్లి బృందం ఆటోను ఢీకొట్టిన వ్యాన్ మహిళ మృతి 15 మందికి గాయాలు విజయవాడ (లబ్బీపేట) : పెళ్లి బృందంతో వెళ్తున్న టాటా ఏస్ ట్రక్ ఆటోను ఐషర్ వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఒక మహిళ మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. బెంజిసర్కిల్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. దీంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. వివరాల ప్రకారం.. పటమటలంక ఎన్ఎస్ఎం స్కూల్ సమీపంలో నివసించే వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె వివాహం, ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సమీ ప బంధువుతో శనివారం ఉదయం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బంధువులతో కలిసి పెళ్లికి వెళ్లేందుకు శుక్రవారం వేకువజామున సిద్ధమయ్యారు. పెళ్లి కుమార్తెతోపాటు మరి కొందరు కారులో వెళ్లగా ఆమె తల్లిదండ్రులు, మరో 14 మంది రైలులో గిద్దలూరు వెళ్లేందుకు ట్రక్కు ఆటోలో రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. ఆటో నిర్మలా కాన్వెంట్ రోడ్డులోకి వచ్చి జాతీయ రహదారి దాటుతుండగా బెంజిసర్కిల్ వైపు నుంచి వస్తున్న ఐషర్ వ్యాన్ ఢీకొట్టింది. క్షతగాత్రులను 108లో తొలుత ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం హెల్ప్ ఆస్పత్రికి తరలించారు. అయితే అల్లూరమ్మ(37) మృతి చెందగా, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి, బంధువులు రమణమ్మ, సూరీడమ్మ, పిచ్చమ్మ, ఆదిలక్ష్మి, నాగేంద్ర, శ్రీదేవి, సూర్య డు, మహాలక్ష్మి, అనూష, తరుణ్, మాలమ్మ, మునిశేఖర్లతోపాటు ఎనిమిదేళ్ల చిన్నారి కృష్ణవేణికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. అల్లూరమ్మ మృతదేహానికి ప్రభుత్వాస్పత్రిలో పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. -
వివాహ వేడుకకు వెళుతూ..
ద్వారకాతిరుమల : పెళ్లిబృందం ప్రయాణిస్తున్న ట్రక్ ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది గాయాలపాల య్యారు. వీరిలో 9 మందికి తీవ్ర గాయూలు కాగా మి గిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. ద్వారకాతిరుమల శివారు లక్ష్మీపురం వద్ద గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. దెందులూరు మండలం కొవ్వలికి చెందిన పెళ్లి బృందం సభ్యులు సుమారు 20 మంది గురువారం రాత్రి ఆటోలో బయలుదేరి ద్వారకాతిరుమల వెళ్తున్నారు. మార్గమధ్యలో సంఘటనా స్థలం వద్ద వీరి ఆటో ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపు వెళుతున్న సుద్దలోడు లారీని వేగంగా ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయూణిస్తున్న డ్రైవర్‌తో సహా 14 మందికి గాయూలయ్యూరుు. లారీ డ్రైవర్ వాహనాన్ని ఎడమవైపు మార్జిన్లోకి తిప్పడంతో ఘెర ప్రమాదం తప్పింది. రెండు 108 వాహనాల ద్వారా క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొవ్వలికి చెందిన బళ్ల సత్యన్నారాయణకు కుడి కాలు, వడిగిన అనిల్‌కు ఎడమ కాలు విరిగింది. కె.ప్రసాద్, బొప్పన గణేష్, డి.గణేష్, డి.గంగరాజు, దెందులూరుకు చెందిన కె.అశోక్, వి.పవన్ మన్మధరావు, కేఎన్ పురానికి చెందిన బి.వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయూలయ్యూరుు. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని ఏలూరు వీఆర్ ఎస్సై కర్రి సతీష్‌కుమార్, స్థానిక పోలీస్ సిబ్బంది పరిశీలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.