![YV Subba Reddy Meets CM YS Jagan at Tadepalli CM Camp Office - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/05/10/YV-Subba-Reddy.jpg.webp?itok=qR03NN2w)
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో కొత్తగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి ఆహ్వనించారు.
మే 21 నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26న విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఉంటాయని సీఎం జగన్‌కు వైవీ సుబ్బారెడ్డి వివరించారు. సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ ఈవో గుణభూషణ రెడ్డి, ఏఈవో దొరస్వామి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment