మైసూరు: ఆన్‌లైన్‌లో పరిచయమైన ఒడిశా యువతిని ప్రియుడు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. యథా ప్రకారం అమ్మాయి తల్లిదండ్రులు ప్రేమ లేదు, పెళ్లీ లేదు అని యువతిని తమతో తీసుకెళ్లారు. దీంతో ప్రియుడు కమ్ భర్త.. తన భార్య కావాలని పోలీసులను ఆశ్రయిచాడు.
వివరాలు.. మైసూరు సిటీకి చెందిన మహ్మద్ అఖిబ్ అనే యువకుడు ఆన్‌లైన్‌లో గేమ్ ఆడుతున్న సమయంలో ఒడిశాకు చెందిన ప్రియాత్ రావత్ అనే యువతి పరిచయమైంది. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేమించుకున్నారు. తరువాత అఖిబ్ ఒడిశాకు వెళ్ళి యువతిని మైసూరుకు తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నాడు.
తమ కుమార్తె కనిపించక పోవడంతో యువతి తల్లిదండ్రులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను మైసూరులో ఉన్నానని, పెళ్లి చేసుకున్నానని ప్రియాత్ తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పోలీసులతో వచ్చి మాట్లాడాలని చెప్పి కూతురిని పిలిపించుకుని ఒడిశాకు తీసుకెళ్లారు. అఖిబ్ భార్య కావాల్సిందేనని మైసూరు నగరంలోని ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment