కర్ణాటక: మనసుపడితే మూడుముళ్ల పండుగకు జాతిభేదాలతో పనేముంది. కొన్నిసార్లు దేశ సరిహద్దులు కూడా దాటి జంటలు ఒక్కటవుతాయి. ఇదే కోవలో స్పెయిన్ యువకుడు, మండ్య యువతి ప్రేమ బంధాన్ని పెళ్లితో సుస్థిరం చేసుకున్నారు. వివరాలు.. జిల్లాలోని కేఆర్ పేటె పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి రవీంద్రనాథ కుమార్తె దీక్షిత కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్‌లో యోగా టీచర్‌గా పనిచేస్తోంది.
స్పెయిన్‌లోని బార్సిలోనాకు చెందిన జాన్ వైడల్ ఆశ్రమానికి వస్తుండేవాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమ మొగ్గ తొడిగింది. పెద్దలకు చెప్పగా రెండు కుటుంబాలు పెళ్లికి సమ్మతించారు. దీంతో మంగళవారం కెఆర్ పేటెలోనే సంప్రదాయ రీతిలో వివాహ వేడుక జరిగింది. వరుని తల్లిదండ్రులు, తోబుట్టువులు సంప్రదాయ దుస్తులు ధరించి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment